News July 29, 2024
పాల్వంచ కేటీపీఎస్‌లో పట్టాలు తప్పిన రైలు

పాల్వంచ కేటీపీఎస్‌లోని ఏడో దశలో కోల్ వ్యాగన్ రైలు పట్టాలు తప్పింది. ఆదివారం కోల్ యార్డులో బొగ్గును అన్లోడ్ చేసుకుని తిరిగి వెళుతున్న క్రమంలో రైలు పట్టాలు తప్పింది. KTPS అధికారులు , రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడంతో వాటిని తిరిగి పట్టాలపై ఎక్కించారు. కాగా ఈ ప్రమాదంలో ఎటువంటి ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
Similar News
News November 28, 2025
తపాల శాఖ ఆధ్వర్యంలో పిలాటికల్ ఎగ్జిబిషన్

ఖమ్మం నగరంలో శుక్రవారం తపాలా శాఖ ఆధ్వర్యంలో పిలాటికల్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్‌ను జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు సందర్శించి తపాల శాఖ స్టాంపులను ఆసక్తిగా తిలకించారు. మొత్తం 108 ప్రేముల్లో 3,456 జాతీయ, అంతర్జాతీయ స్టాంపులను అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు. పిలాటికల్ ఎగ్జిబిషన్ ద్వారా విద్యార్థులకు పరిజ్ఞానం పెరుగుతుందని పేర్కొన్నారు.
News November 28, 2025
కులాలు, మతాల మధ్య రెచ్చగొట్టే చర్యలు ఉపేక్షించబోం: ఖమ్మం సీపీ

పంచాయతీ ఎన్నికల్లో పోటీ చాలా తీవ్రంగా ఉంటుందని, క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులను సీపీ సునీల్ దత్ ఆదేశించారు. కులాలు, మతాల మధ్య ఎటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే చర్యలు ఉపేక్షించడం జరగదని హెచ్చరించారు. ఎక్కడ ఎటువంటి ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.
News November 28, 2025
ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై టోల్ ఫ్రీ నెంబర్: కలెక్టర్

ఖమ్మం: ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 1077ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. టోల్ ఫ్రీ నెంబర్ పట్ల ప్రజలకు విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించారు. నామినేషన్లు ముగిసి అభ్యర్థులు ఫైనల్ అయిన తర్వాత ప్రలోభాలు పెరిగే అవకాశం ఉందని, క్షేత్రస్థాయిలో బృందాలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.


