News June 22, 2024
పాల్వంచ: కేటీపీఎస్ అధికారులతో ఎమ్మెల్యే సమావేశం

కేటీపీఎస్ స్క్రాప్ టెండర్ల అవినీతి అక్రమాల నిగ్గు తేల్చే వరకు విశ్రమించనని ఎమ్మెల్యే సాంబశివరావు అన్నారు. ఇటీవల కాలంలో కేటీపీఎస్ O&M స్క్రాప్ టెండర్, తరలింపు విషయాల్లో వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం O&M DD ప్రాంతాన్ని ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం సిఈ చాంబర్లో అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన టెండర్ ప్రక్రియ, విచారణ కమిటీకి అందించిన నివేదికల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News November 2, 2025
ఖమ్మం: ఈనెల 15న సూపర్ లోక్ అదాలత్

పెండింగ్ కేసుల పరిష్కారమే లక్ష్యంగా ఈనెల 15న సూపర్ లోక్ ఆదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జీ జి.రాజగోపాల్ తెలిపారు. ఖమ్మం జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా సోమవారం నుంచి ఈనెల 15వ తేదీ వరకు చెక్ బౌన్స్ కేసులు, రోడ్డు ప్రమాద బీమా కేసులు, రాజీ పడదగిన సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవచ్చని వెల్లడించారు.
News November 1, 2025
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్

వర్ష ప్రభావంతో వరద చేరే లోతట్టు ప్రాంతాల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించి శాశ్వత పరిష్కారానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అనుదీప్ అన్నారు. శనివారం మధిరలోని లోతట్టు ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటించారు. పెద్దచెరువు బ్యాక్ వాటర్ ప్రభావం వలన లోతట్టు ప్రాంతాల వరద నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నారు.
News November 1, 2025
కంప్యూటర్ల మరమ్మతుకు టెండర్లు దాఖలు చేయాలి: అ.కలెక్టర్

ఖమ్మం జిల్లాలోని 84 ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న కంప్యూటర్స్ మరమ్మతులకు NOV 6 లోపు టెండర్లు దాఖలు చేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి తెలిపారు. కంప్యూటర్ మరమ్మతుల నిమిత్తం 69 ఉన్నత పాఠశాలలకు రూ.15 వేలు చొప్పున, 15 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.5 వేల చొప్పున మొత్తం రూ.11.10 లక్షలు కేటాయించడం జరిగిందన్నారు. ఆసక్తి గల వారు DEO కార్యాలయంలో ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


