News April 17, 2025
పాల్వంచ పెద్దమ్మకు సువర్ణ పుష్పార్చన

పాల్వంచ పెద్దమ్మ గుడిలో గురువారం ఆలయ ఈవో రజనీకుమారి ఆదేశాల మేరకు ఆలయ అర్చకులు పెద్దమ్మ తల్లికి సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా పుష్పార్చన పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర పూజలు జరిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ప్రత్యేక పూజలు పరిసర ప్రాంతాల భక్తులు, పెద్దమ్మ గుడి ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News December 13, 2025
లోక్ అదాలత్‌లో 19,577 కేసులు పరిష్కారం

జాతీయ లోక్‌అదాలత్‌లో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మొత్తం 19,577 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్తి తెలిపారు. జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో 28 బెంచీల ద్వారా 284 సివిల్, 19,096 క్రిమినల్, 197 మోటార్ యాక్సిడెంట్ కేసులను పరిష్కరించారు. మోటార్ ప్రమాదాలకు సంబంధించిన కేసుల్లో బాధితులకు రూ. 6.34 కోట్ల నష్టపరిహారం చెల్లించినట్లు ఆయన వివరించారు.
News December 13, 2025
నిషేధాజ్ఞల ఉల్లంఘన.. వెదురుగట్ట సర్పంచ్‌పై కేసు

కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్ట గ్రామ సర్పంచ్‌గా గెలుపొందిన పెంచల శ్రీనివాస్‌పై ఎన్నికల నిబంధనలు (MCC) ఉల్లంఘన కింద కేసు నమోదైంది. డిసెంబరు 11న రాత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత, నిషేధాజ్ఞలు అమలులో ఉన్నప్పటికీ సుమారు 100 మందితో కలిసి విజయోత్సవ ర్యాలీ నిర్వహించినందుకు ఎఫ్‌ఎస్‌టీ ఇన్‌చార్జ్, డిప్యూటీ తహశీసిల్దార్ ఫిర్యాదు మేరకు చొప్పదండి పోలీసులు కేసు నమోదు చేశారు.
News December 13, 2025
KNR: పంచాయతీ పోరుకు పటిష్ట భద్రత: సీపీ

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో రేపు జరగనున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. మానకొండూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని 113 పంచాయతీల కోసం 1046 పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలు మోహరిస్తున్నట్లు చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణకు నిషేధాజ్ఞలు విధించారు. విజయోత్సవ ర్యాలీలు నిషేధమని స్పష్టం చేశారు.


