News February 10, 2025
పాల్వంచ: ‘ప్రజావాణి దరఖాస్తు పరిష్కారంలో జాప్యం చేయొద్దు’

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తు పరిష్కారంలో జాప్యం చేయొద్దని అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ సందర్భంగా దరఖాస్తు చేసిన అభ్యర్థులను వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News February 8, 2026
అలంపూర్: మున్సిపల్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా ఎడెల్లి విగ్నేష్

అలంపూర్ మున్సిపల్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా అచ్చంపేట ప్రాంతానికి చెందిన ఎడెల్లి విగ్నేష్‌ను టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ నియమించారు. తనపై నమ్మకముంచిన అధిష్ఠానానికి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌కు విగ్నేష్ కృతజ్ఞతలు తెలిపారు. అలంపూర్‌లో కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
News February 8, 2026
వనపర్తి: ప్రశాంతంగా 7వ రోజు ఇంటర్ ప్రాక్టికల్స్

వనపర్తి జిల్లాలోని 15 కేంద్రాలలో 7వ రోజు ఇంటర్ ప్రాక్టికల్స్ ప్రశాంతంగా ముగిశాయని DIEO అంజయ్య తెలిపారు. ఉదయం 486 మంది, మధ్యాహ్నం 581 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం మీద ఆదివారం జరిగిన పరీక్షలకు 36 మంది గైర్హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. జిల్లా అధికారులు పలు పరీక్షా కేంద్రాలను స్వయంగా తనిఖీ చేశారు.
News February 8, 2026
జమ్మలమడుగు: కన్యతీర్థం అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా?

జమ్మలమడుగు మండలంలోని పెద్దండ్లూరు వద్ద పెన్నా నదీ తీరాన భాను కొండల మధ్య సుమారు 5 వేల ఏళ్లకు పూర్వం ఈ క్షేత్రం వెలిసినట్లు ఆలయంలోని శాసనాలు చెబుతున్నాయి. ఈ క్షేత్రంలోని పుష్కరిణిలో అలనాడు దేవకన్యకలు నిత్యం స్నానమాచరించి అమ్మవారిని సేవించుకోవడం వల్ల ఈ క్షేత్రానికి శ్రీకన్యతీర్థం అని పేరు వచ్చినట్లు పూజారులు చెబుతున్నారు. కన్యతీర్థం, తిరుపతి, శ్రీశైలం ఆలయంలో ఒకే ఆచారం, పోలికలు ఉండటం మరో విశేషం.


