News July 13, 2024

పాల్వంచ: భార్య జ్ఞాపకంగా శునకాల పెంపకం

image

నెహ్రూనగర్‌కు చెందిన దుర్గారావు జీవనోపాధి వెతుక్కుంటూ ఇరవై ఏళ్ల క్రితం చర్ల మండల కేంద్రానికి వెళ్లారు. సతీమణి మాధవి గతేడాది అనారోగ్యంతో మృతిచెందింది. తన జీవిత భాగస్వామి ఎంతో ఇష్టంగా పెంచుకునే శునకాలను అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. ఒక్క క్షణమైనా వాటిని వీడి ఉండొద్దన్న తలంపుతో ఎటు వెళ్లినా తన వెంటే తీసుకెళ్తున్నారు. అందుకోసం ద్విచక్రవాహనానికి ఇరువైపు రెండు ఇనుప తొట్లు ఏర్పాటు చేశారు.

Similar News

News October 13, 2025

ఈవీఎం గోడౌన్ తనిఖీ చేసిన కలెక్టర్

image

జిల్లా కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం (EVM) గోడౌన్‌ను కలెక్టర్ అనుదీప్ సోమవారం నెలవారీ తనిఖీల్లో భాగంగా పరిశీలించారు.ఈవీఎం, వీవీ ప్యాట్‌లు ఉన్న గది సీల్‌ను కలెక్టర్ పరిశీలించారు. గోడౌన్‌లో ఫైర్ అలారం, అగ్నిమాపక యంత్రాల కండిషన్‌ను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం తనిఖీ రిజిస్టర్‌లో కలెక్టర్ సంతకం చేశారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఉన్నారు.

News October 13, 2025

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్

image

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు డా.శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డిలతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

News October 13, 2025

పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయి: సీపీ

image

పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. హెడ్ కానిస్టేబుళ్ల నుంచి ఏఎస్సైగా పదోన్నతి పొందిన పోలీస్ అధికారులు సోమవారం కమిషనరేట్లో పోలీస్ కమిషనర్‌ను కలిశారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన పోలీస్ అధికారులను పోలీస్ కమిషనర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ రామానుజం తదితరులు పాల్గొన్నారు.