News March 30, 2025
పాల్వంచ మండలంలో అత్యధిక ఉష్ణోగ్రత

కామారెడ్డి జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను అధికారులు వెల్లడించారు. అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం పాల్వంచ 41.4, పిట్లం 41.3, బిచ్కుంద, రామారెడ్డి, నస్రుల్లాబాద్ మండలాల్లో 41.2, మద్నూర్ 41.1, గాంధారి, జుక్కల్, కామారెడ్డి, బాన్సువాడ, దోమకొండ,, మండలాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఎండల తీవ్రత పెరుగుతున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
Similar News
News November 17, 2025
బాలానగర్లో 9.9 ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్ నగర్ జిల్లాలో చలి తీవ్రత రోజుకు పెరిగిపోతుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాలానగర్లో 9.9 డిగ్రీల అత్యంత ఉష్ణోగ్రత నమోదయింది. రాజాపూర్ 10.2, గండీడ్ మండలం సల్కర్ పేట, మిడ్జిల్ 10.5, హన్వాడ 11.3 కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 11.4, భూత్పూర్ 11.6, కోయిలకొండ మండలం పారుపల్లి 11.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
News November 17, 2025
వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి: MBNR SP

శీతాకాలంలో వాహనదారులు జాగ్రత్తగా వాహనాలు నడపాలని మహబూబ్ నగర్ SP జానకి సూచించారు. చలికాలంలో పొగ మంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనపడని కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. రాత్రి, తెల్లవారుజామున ప్రయాణాలను తగ్గించుకోవడం మంచిదని వివరించారు. బైక్ నడిపై వారు తప్పనిసరిగా హెల్మెట్, చేతులకు గ్లౌజులు ధరించాలన్నారు.
News November 17, 2025
HYD: ఆ పోస్ట్ అప్పుడే తొలగించాం: సీవీ ఆనంద్

నటుడు బాలకృష్ణపై సీవీ ఆనంద్ పెట్టిన ఓ ఎమోజీ వివాదాస్పదమైంది. దీనిపై బాలయ్య ఫ్యాన్స్ నుంచి విమర్శలు రావడంతో సీవీ ఆనంద్ స్పందించారు. దాదాపు 2 నెలల క్రితం తన సోషల్ మీడియాను నిర్వహించే వ్యక్తి ఆ పోస్ట్ చేశారని చెప్పారు. వెంటనే ఆ పోస్ట్ను తొలగించి, బాలకృష్ణకు క్షమాపణలు చెప్పానని స్పష్టంచేశారు. ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలని ట్వీట్ చేశారు.


