News April 1, 2025
పాస్టర్ మృతిపై రెండు రోజుల్లో నివేదిక: హోం మంత్రి

పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల అనుమానాస్పద మృతిపై పోలీసులు లోతుగా విచారణ నిర్వహిస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. మంగళవారం నక్కపల్లి క్యాంపు కార్యాలయంలో హోం మంత్రిని రాష్ట్ర పాస్టర్స్ యూనియన్ ప్రతినిధులు కలిసి ప్రవీణ్ మృతిపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. రెండు రోజుల్లో పూర్తి నివేదిక వస్తుందన్నారు.
Similar News
News December 1, 2025
సిద్దిపేట: సమస్యాత్మక గ్రామాల్లో నిఘా

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. గ్రామాల్లో పోలీస్ కవాతు నిర్వహిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వినియోగించాలని వివరిస్తున్నారు. ఆదివారం గజ్వేల్, మిరుదొడ్డి, అక్బర్పేట్-భూంపల్లి మండలాల్లో ACPల ఆధ్వర్యంలో ప్రత్యేక బలగాలతో కవాతు నిర్వహించి ప్రజలను జాగృతం చేశారు.
News December 1, 2025
గ్లోబల్ సిటీగా మారనున్న హైదరాబాద్

గ్రేటర్ హైదరాబాద్ త్వరలోనే గ్లోబల్ సిటీగా మారనుంది. ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీలను విలీనం చేసిన నేపథ్యంలో ఈ ఘనత సాధించనుంది. జనాభా పరంగా ఇప్పటికే 1.85 కోట్లకి చేరుకుంది. మున్సిపాలిటీల విలీనంతో మరింత జనాభా పెరగనుంది. జనాభాకు తగ్గట్టుగా వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. జనాభాతో పాటుగా అభివృద్ధిలోను గ్రేటర్ హైదరాబాద్ దూసుకెళ్లనుంది.