News June 11, 2024
పాస్‌లు ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతి: సీపీ రామకృష్ణ

రేపు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపధ్యంలో విజయవాడ నుంచి, ఇతర ప్రదేశాల నుంచి గన్నవరం ఫంక్షన్ ప్లేస్‌కు పాస్‌లు ఉన్న బస్సులు, కార్లను మాత్రమే అనుమతించడం జరుగుతుందని పోలిస్ కమిషనర్ రామకృష్ణ మంగళవారం తెలిపారు. పాస్‌లు లేని ఇతర వాహనాలు అనుమతించబడదని, విజయవాడలోని 9 ప్రాంతాల నుంచి సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రామాన్ని ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడం జరుగుతుందన్నారు.
Similar News
News March 27, 2025
పోలీస్ వ్యవస్థ పట్ల నమ్మకాన్ని పెంచే లక్ష్యంగా పల్లెనిద్ర: ఎస్పీ

ప్రజలు శాంతియుత జీవనంలో కొనసాగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని, పోలీస్ వ్యవస్థ పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో పల్లెనిద్ర చేపట్టినట్లు ఎస్పీ గంగాధరరావు తెలిపారు. బంటుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లేశ్వరం గ్రామంలో MPUP స్కూల్‌లో ఎస్పీ, పోలీసు అధికారులతో కలిసి పల్లెనిద్ర చేశారు.
News March 27, 2025
గుడ్లవల్లేరు: విద్యార్థినితో అనుచిత ప్రవర్తన.. టీచర్ సస్పెండ్

చదువు కోసం వచ్చిన ఓ విద్యార్థిని వేదనకు గురైంది. గుడ్లవల్లేరు డైట్ కాలేజీలో డిప్యూటేషన్‌పై బోధన చేస్తున్న స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుడు హరి కిరణ్ ఆమెను 20 రోజులుగా వేధిస్తున్నాడని, అసభ్య సందేశాలు, ఫోన్ కాల్స్‌తో ఇబ్బంది పెడుతున్నాడని ఆమె ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసింది. విషయాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించి హరికిరణ్‌ను సస్పెండ్ చేశారు. అతనిపై పోలీసు చర్యలు కూడా తీసుకోవాలని సూచించారు.
News March 27, 2025
గన్నవరం: రేపు వంశీ బెయిల్‌పై తీర్పు

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు విచారణలో ప్రాసిక్యూషన్ తరపున జేడీ రాజేంద్రప్రసాద్, వంశీ తరఫున డాక్టర్ దేశీ సత్య శ్రీ వాదనలు వినిపించారు. వాదనలు ముగిసిన అనంతరం న్యాయమూర్తి హిమబిందు తీర్పును మార్చి 28కి రిజర్వ్ చేశారు.