News February 4, 2025

పాస్‌వర్డ్‌ను ఎవరికీ షేర్ చేయవద్దు: అన్నమయ్య పోలీసులు

image

మీ పాస్‌వర్డ్‌ను ఎవరికీ షేర్ చేయవద్దు, సురక్షిత బ్రౌజింగ్‌ను చేయండని అన్నమయ్య పోలీసులు సూచిస్తున్నారు. ఒక్క అజాగ్రత్త క్లిక్ మీ సమాచారాన్ని బహిర్గతం చేస్తుందన్నారు. మీరు క్లిక్ చేసే ముందు ఆలోచించండి, యాప్‌లు, సాఫ్ట్‌వేర్లను డౌన్‌లోడ్ చేయడం మానుకోండని అవగాహన కల్పించారు. ప్రతి దానిని అనుమానంగా చూడాలన్నారు. మీరు ఏమి పోస్ట్ చేస్తారో అది ఇంటర్నెట్‌లో ఎప్పటికీ అలానే ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

Similar News

News February 18, 2025

విడదల రజినీకి హైకోర్టులో ఊరట

image

AP: మాజీ మంత్రి విడదల రజినీకి హైకోర్టులో ఊరట దక్కింది. తన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు రజినీ, ఆమె PAలపై కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. YCP హయాంలో చిలకలూరిపేట టౌన్ CI సూర్యనారాయణ తనను హింసిస్తూ వీడియోను అప్పటి MLA రజినీకి చూపించారని పిల్లి కోటి అనే వ్యక్తి PSలో ఫిర్యాదు చేశారు. దీంతో రజినీ, PAలపై కేసులు నమోదైన విషయం తెలిసిందే.

News February 18, 2025

యునెస్కో అంతర్జాతీయ సదస్సుకు పెద్దపల్లి బిడ్డ

image

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొమెర గ్రామానికి చెందిన డాక్టర్ కొత్తిరెడ్డి మల్లారెడ్డి పారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో ఈనెల 24 నుంచి 26 వరకు జరిగే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సిల్వర్ జూబ్లీ అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడానికి ఆహ్వానం అందుకున్నారు. ఈ సదస్సులో యునెస్కో, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో సహా 400 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు.

News February 18, 2025

విదేశీ భాషల డిప్లొమా కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని విదేశీ భాషల డిప్లొమా కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఫ్రెంచ్, జర్మన్ భాషల్లో జూనియర్, సీనియర్ డిప్లొమా అభ్యర్థులు తమ పరీక్షా ఫీజును వచ్చే నెల 5వ తేదీలోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని సూచించారు. రూ.300 అపరాధ రుసుముతో పదవ తేదీ వరకు చెల్లించవచ్చని చెప్పారు. ఈ పరీక్షలను ఏప్రిల్ నెలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

error: Content is protected !!