News February 1, 2025

పా.గో : సర్పంచ్ పేరుతో అపరిచిత వ్యక్తుల దరఖాస్తులు

image

పా.గో జిల్లాలోని మండల కేంద్రమైన తాళ్లపూడి సర్పంచ్ లాగిన్‌లో అపరిచిత వ్యక్తులు ప్రధాని మంత్రి విశ్వకర్మ యోజన పథకానికి దరఖాస్తులు అప్లోడ్ చేశారు. ఈ విషయమై సర్పంచ్ నక్కా అనురాధ కలెక్టర్‌, ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు శుక్రవారం తెలిపారు. సర్పంచ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి దరఖాస్తులు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేయాలని సర్పంచ్ కోరారు.

Similar News

News February 26, 2026

కోర్టు కేసులతో విసిగిపోయారా? ఇదే మంచి ఛాన్స్!

image

ఉమ్మడి తూ.గో జిల్లా వ్యాప్తంగా మార్చి 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జాతీయ న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత గురువారం తెలిపారు. రాజీ పడదగ్గ క్రిమినల్, సివిల్, కుటుంబ వివాదాలు, చెక్ బౌన్స్ వంటి కేసులను ఈ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులను రాజీ ద్వారా త్వరితగతిన ముగించుకోవాలని ఆమె సూచించారు.

News February 26, 2026

లెక్క తేల్చేందుకు కసరత్తు.. ముహూర్తం ఫిక్స్!

image

తూ.గో జిల్లాలో 2027 జనాభా గణన నిర్వహణపై అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు జేసీ వై.మేఘస్వరూప్ గురువారం తెలిపారు. రాజమండ్రి కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1వ తేదీ వరకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఈ శిక్షణ జరుగుతుందన్నారు. సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రక్రియను విజయవంతం చేయాలని ఆయన సూచించారు.

News February 26, 2026

CM మాట ఇచ్చారు.. అధికారులు పని మొదలెట్టారు!

image

తాళ్లపూడి మండలం మలకపల్లి ప్రజావేదికలో సనమండ్ర పోసియ్యకు ఇచ్చిన హామీని CM చంద్రబాబు నెరవేర్చారు. కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వరరావు ఆదేశాలతో హౌసింగ్ అధికారులు, MRO గురువారం లబ్ధిదారుడి అసంపూర్తి గృహాన్ని పరిశీలించారు. హౌసింగ్ విభాగం నుంచి ఇంటి నిర్మాణం పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. CM ఆదేశాలతో పనులు వేగవంతం కావడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.