News March 4, 2025

పించన్ల పంపిణీలో అల్లూరి జిల్లా ప్రథమ స్థానం

image

పెన్షన్ల పంపిణీలో అల్లూరి జిల్లా మళ్లీ ప్రథమ స్థానం సాధించిందని కలెక్టర్ దినేష్ కుమార్ సోమవారం పాడేరు కలెక్టరేట్‌లో ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 1,22,907 మంది లబ్ధిదారులు ఉండగా 1,21,453 మందికి పంపిణీ చేసి 98.82 శాతంతో పంపిణీతో అల్లూరి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. గత ఆరు నెలలుగా వరుసగా మొదటి స్థానం సాధిస్తూ వస్తున్న జిల్లా 7వ సారి కూడా మొదటి స్థానంలో నిలవడంతో అధికారులను అభినందించారు.

Similar News

News October 23, 2025

నిరాశలో రైతులు.. ఇదీ ఎనుమాముల మార్కెట్ పరిస్థితి!

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఆసియాలో రెండో అతిపెద్దది. మూడేళ్లుగా పాలకవర్గం ఖాళీ, మద్దతు ధరలు లేనివల్ల రైతులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ అధికారులు, మంత్రి, ఎమ్మెల్యేలు సమస్యలు పరిష్కరించడంలో విఫలమవుతున్నారు. పత్తి సీజన్ ప్రారంభమైనప్పటికీ మార్కెట్ సౌకర్యాలు తగ్గి, ధరలు తక్కువగా ఉండటం రైతుల్లో అసహనాన్ని కలిగించిందని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి.

News October 23, 2025

భారీ వర్షాలు.. గుంటూరు జిల్లాలో స్కూళ్లకు హాలిడే

image

గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గురువారం విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ డీఈవో సీవీ రేణుక ఆదేశాలు జారీ చేశారు. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉండటంతో పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు అయోమయంలో పడ్డారు. వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

News October 23, 2025

మళ్లీ తగ్గిన బంగారం ధరలు

image

ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రా.ల బంగారం ధర రూ.810 తగ్గి ₹1,25,080కు చేరింది. 22 క్యారెట్ల 10g పసిడిపై రూ.750 పతనమై ₹1,14,650గా ఉంది. అటు KG వెండిపై రూ.1,000 తగ్గి రూ.1,74,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.