News June 29, 2024
పింఛన్లకు ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్ మనజీర్ జిలాని

ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద శ్రీకాకుళం జిల్లాలోని అన్ని విభాగాలకు సంబంధించి 3,19,702 మంది లబ్ధిదారులకు రూ.212.07 కోట్ల మేర నిధులు మంజూరయినట్లు కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలాని సమూన్ తెలిపారు. ఈ నెల 29న బ్యాంక్ల నుంచి నగదును విత్డ్రా చేసేలా సచివాలయ ఉద్యోగులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. జులై 1వ తేదీనే ఇంటి వద్ద సచివాలయ ఉద్యోగులతో వంద శాతం పింఛన్లు పంపిణీ చేసేలా చర్యలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు.
Similar News
News November 27, 2025
టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా

టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్కిల్ హబ్ కేంద్రం ఆధ్వర్యంలో శనివారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ టి.గోవిందమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్హతలతో 18-25 సంవత్సరాల వయసు కలిగిన వారు అర్హులు అన్నారు. అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతోపాటు నవీకరించిన బయోడేటా, రెండు పాస్ పోర్ట్ సైజ్ కలర్ ఫోటోలతో హాజరు కావాలన్నారు.

News November 26, 2025
టెక్కలి: సెప్టిక్ ట్యాంక్లో పడి చిన్నారి మృతి

టెక్కలిలోని మండాపోలం కాలనీకి చెందిన కొంకి భవ్యాన్ (5) బుధవారం సాయంత్రం సెప్టిక్ ట్యాంక్లో పడి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. సాయంత్రం తన ఇంటికి సమీపంలో ఆడుకుంటూ ఉండగా నిర్మాణ దశలో ఉన్న మరో ఇంటికి చెందిన సెప్టిక్ ట్యాంక్లో ప్రమాదవశాత్తు పడిపోవడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.