News June 29, 2024

పింఛన్‌లకు ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్ మనజీర్ జిలాని

image

ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద శ్రీకాకుళం జిల్లాలోని అన్ని విభాగాలకు సంబంధించి 3,19,702 మంది లబ్ధిదారులకు రూ.212.07 కోట్ల మేర నిధులు మంజూరయినట్లు కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలాని సమూన్ తెలిపారు. ఈ నెల 29న బ్యాంక్‌ల నుంచి నగదును విత్‌డ్రా చేసేలా సచివాలయ ఉద్యోగులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. జులై 1వ తేదీనే ఇంటి వద్ద సచివాలయ ఉద్యోగులతో వంద శాతం పింఛన్లు పంపిణీ చేసేలా చర్యలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు.

Similar News

News October 8, 2024

DSC శిక్షణా సంస్థల నుంచి దరఖాస్తుల ఆహ్వానం: కలెక్టర్

image

SC,ST విద్యార్థులకు ఉచిత DSC శిక్షణ ఇవ్వడానికి శిక్షణా సంస్థల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ ఇచ్చినందుకు శిక్షణ సంస్థలకు టెండర్ ద్వారా అమౌంట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆసక్తి కలిగిన శిక్షణా సంస్థలు వివరాలకు https://tender.apeprocurernant.gov.in పోర్టల్‌లో డాక్యుమెంట్ నంబర్ 757795ను పరిశీలించి ఈ నెల 21లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

News October 8, 2024

SKLM: 2714 అభివృద్ధి పనులకు అనుమతులు- కలెక్టర్

image

రాష్ట్ర సచివాలయం నుంచి మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈనెల 14 నుంచి 20 వరకు నిర్వహించే పల్లె పండుగ కార్యక్రమంపై మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లాలో అన్ని పంచాయతీల పరిధిలో 3071 పనులు గుర్తించామని.. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ అభివృద్ధి పనులకు సంబంధించి రూ.249 కోట్లు అంచనా వేసినట్లు తెలిపారు. వీటిలో 2714 పనులకు అనుమతులు ఇచ్చామన్నారు.

News October 8, 2024

కంచిలి: భవానీ సన్నిధానంలో విషాదం

image

కంచిలి మండలం నారాయణ బట్టి గ్రామంలో భవానీ సన్నిధానంలో జరిగిన దారుణ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామంలో ఏర్పాటు చేసిన భవానీ సన్నిధానంలో గ్రామానికి చెందిన కోన మణి (21) అనే భవానీ మాలధారణ చేసిన వ్యక్తి విద్యుత్ షాక్ తగిలి మరణించినట్లు స్థానికులు తెలిపారు. ఈ మేరకు గురు స్వామి సూచనలతో భవానీ మాలధారణ చేసిన భక్తులందరూ దీక్ష విరమించుకున్నట్లు వారు పేర్కొన్నారు.