News January 31, 2025
పింఛన్లకు రూ.114 కోట్లు మంజూరు

శ్రీ సత్యసాయి జిల్లాలో రేపు జరగనున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమం శనివారం మధ్యాహ్నంలోపు పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. 32 మండలాల్లోని లబ్ధిదారులకు రూ.114 కోట్లను పంపిణీ చేయనున్నట్లు వివరించారు. పింఛన్ పంపిణీని ఉదయం 6 గంటలకు ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నియోజవర్గ, మండల స్థాయిలో రేపు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు.
Similar News
News November 2, 2025
HZB: ‘లింగ నిర్ధారణ పరీక్షలు పూర్తిగా నిషేధం’

హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని అదనపు కలెక్టర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య, సౌకర్యాలను పరిశీలించి వైద్యులతో చర్చించారు. ఆడపిల్లల పుట్టుకపై తల్లిదండ్రులు ఎలాంటి తారతమ్యాలు చూపరాదని ఆమె సూచించారు. లింగ నిర్ధారణ పరీక్షలు పూర్తిగా నిషేధితమని, అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News November 2, 2025
కొండచరియలు విరిగిపడి 21మంది మృతి

భారీ వర్షాలు కెన్యాలో తీవ్ర విషాదాన్ని నింపాయి. రిఫ్ట్ వ్యాలీలో కొండచరియలు విరిగిపడి 21మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30మంది గల్లంతు అయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు వెస్ట్రన్ కెన్యాలో వరదలొచ్చి రోడ్లు కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లు ధ్వంసమై పలువురు నిరాశ్రయులు అయ్యారు.
News November 2, 2025
అల్లూరి: మొదటి రోజు 94.88% పెన్షన్ పంపిణీ పూర్తి

అల్లూరి జిల్లాలో మొదటి రోజైన శనివారం 94.88% పెన్షన్ పంపిణీ పూర్తయిందని కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. జిల్లాలోని 22 మండలాల్లో 1,22,306 మంది పెన్షన్ లబ్ధిదారులకు రూ.51,51,80,000 మంజూరైందన్నారు. శనివారం రాత్రి పంపిణీ ముగిసే సమయానికి 1,16,039 మందికి రూ.48,78,87,500 పంపిణీ చేశామన్నారు. మిగిలిన 6,267 మందికి పెన్షన్ పంపిణీ జరుగుతుందన్నారు.


