News August 1, 2024

పింఛన్ల పంపిణీలో శ్రీకాకుళం జిల్లా టాప్

image

ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ కార్యక్రమం గురువారం ఉదయం 6 గంటల నుంచి కొనసాగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 3,18,017 పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా.. ఉదయం 10.15 సమయానికి 2,89,523 మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. దీంతో పింఛన్ల పంపిణీలో జిల్లా 91.04 శాతంతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలించింది. 

Similar News

News October 8, 2024

శ్రీకాకుళం: ఈ నెల 14వ తేదీన పల్లె పండుగ

image

ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వారం రోజుల పాటు ‘పల్లె పండుగ’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమానికి జిల్లాలో అన్ని ఏర్పాట్లుచేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో పల్లె పండుగ కార్యక్రమాలపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.

News October 8, 2024

10న YCP శ్రీకాకుళం జిల్లాధ్యక్షుడిగా ధర్మాన ప్రమాణస్వీకారం

image

నరసన్నపేట YCP కార్యాలయంలో ఈ నెల 10న పార్టీ జిల్లాధ్యక్షుడిగా మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకునిగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, డాక్టర్స్ సెల్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రమాణ స్వీకారం చేస్తారని ఎంపీపీ మురళి తెలిపారు. నరసన్నపేటలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వైసీపీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

News October 8, 2024

శ్రీకాకుళం: కేజీబీవీల్లో ఖాళీలు.. 15 వరకు అప్లై చేసుకోండి

image

శ్రీకాకుళం జిల్లాలోని KGBVలో ఔట్ సోర్సింగ్‌లో పనిచేసేందుకు పలు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DEO తిరుమల చైతన్య తెలిపారు. కుకింగ్- 9, డేనైట్ వాచ్‌మెన్- 4, స్కావెంజర్- 3, స్వీపర్- 4 పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు. అలాగే ఆదర్శ పాఠశాలల్లో చౌకీదారు- 6, హెడ్‌కుక్- 4, సహాయ కుక్- 6 పోస్టులకు ఆసక్తి గల మహిళలు ఈ నెల 15లోగా MEO కార్యాలయాల్లో దరఖాస్తులు అందజేయాలన్నారు.