News August 1, 2024
పింఛన్ల పంపిణీలో శ్రీకాకుళం జిల్లా టాప్

ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ కార్యక్రమం గురువారం ఉదయం 6 గంటల నుంచి కొనసాగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 3,18,017 పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా.. ఉదయం 10.15 సమయానికి 2,89,523 మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. దీంతో పింఛన్ల పంపిణీలో జిల్లా 91.04 శాతంతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలించింది.
Similar News
News January 16, 2026
శ్రీకాకుళం: నేటి నుంచి ఇక్కడ సంక్రాంతి మొదలు

శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని <<18868852>>కొసమాలలో<<>> దేవాంగుల వీధిలో కనుమ రోజున భోగి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వీధిలోని చేనేత కార్మికులు నేడు భోగి వేసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. నందిగాం పరిధిలోని పెద్దతామరాపల్లిలోనున్న పెద్దదేవాంగులవీధిలో ఇదే ఆచారాన్ని పాటిస్తారు. మీ పరిధిలో నేటి సంక్రాంతి వేడుకలను జరుపుకుంటే కామెంట్‌లో తెలపండి.
News January 16, 2026
ఎల్.ఎన్.పేట: పండగపూట విషాదం.. యువకుడు మృతి

ఎల్.ఎన్.పేట(M) మోదుగువలస నిర్వాసితుల కాలనీకి చెందిన సాయికుమార్(25) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. భోగి రోజు సాయికుమార్ మరో యువకుడితో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తూ స్కాట్ పేట వద్ద నడిచి వెళుతున్న వ్యక్తిని ఢీకొని కిందపడ్డారు. సాయికుమార్ మృతితో గ్రామంలో విషాద చ్ఛాయలు అలముకున్నాయి. దీనిపై కేసు నమోదు చేసినట్లు సరుబుజ్జిలి ఎస్ఐ హైమావతి తెలిపారు.
News January 16, 2026
శ్రీకాకుళం జిల్లాలో నేడు భోగి జరుపుకొనే ప్రాంతమిదే!

శ్రీకాకుళం జిల్లాలోని ఆ ప్రాంతవాసులు భోగి పండుగనే జరుపుకోరు. నేడు (కనుమ) రోజున ఈ వేడుకను నిర్వహించి.. అనంతరం సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. మెళియాపుట్టిలోని కొసమాల గ్రామంలో దేవాంగుల వీధిలోని చేనేతలే ఇలా భోగిని భిన్నంగా చేస్తారు. వృత్తి రీత్యా పనుల్లో తీరిక లేకపోవడమే ప్రధాన కారణం. ఆనాటి పూర్వీకుల ఆచారాన్నే ఇప్పటికీ ఆ వృత్తుల వారు కొనసాగిస్తున్నారు.


