News February 20, 2025

పింఛన్ల వెరిఫికేషన్ పారదర్శకంగా జరుగుతుంది: మంత్రి కొండపల్లి 

image

రాష్ట్రంలో దివ్యాంగుల పింఛన్ల వెరిఫికేషన్ ఎంతో పారదర్శకంగా జరుగుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గురువారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో దాదాపు 8 లక్షల దివ్యాంగులకు సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందని, ఇప్పటివరకు 1.20 లక్షల పింఛన్ వెరిఫికేషన్ పూర్తి అయినట్లు చెప్పారు.

Similar News

News March 23, 2025

ఎయిర్ టాక్సీలకు కేంద్రంగా గుంటూరు

image

ఎయిర్ టాక్సీలకు కేంద్రంగా గుంటూరు మారుతోంది. ఈ గాల్లో ఎగిరే టాక్సీలను తయారు చేస్తున్న సంస్థ పేరు మ్యాగ్నమ్ వింగ్స్. గుంటూరు నల్ల చెరువులో చావా అభిరాం అనే వ్యక్తి ఈ ఎయిర్ ట్యాక్సీలను తయారు చేస్తున్నాడు. ట్రాఫిక్‌తో సతమతమవుతున్న నగరాల్లో ఎయిర్‌ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ పనికి పూనుకున్నారు. తక్కువ ఖర్చుతో ఈ ఎయిర్‌ ట్యాక్సీలో ప్రయాణం చేసేలా రూపొందిస్తున్నారు.

News March 23, 2025

పెదకాకాని: పెళ్లి అయిన 9 రోజులకే మృతి

image

పెళ్లి అయిన 9 రోజులకే డాక్టర్ మృతి చెందిన విషాద ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలుకు చెందిన శివాచారి(32) డాక్టర్ చదువుకుని పెదకాకాని మండలంలో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబ సభ్యులు ఈనెల 13న లావణ్యతో వివాహం చేశారు. దీంతో రెండు రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. వెంటనే విజయవాడ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

News March 23, 2025

వ్యభిచార గృహంపై దాడి.. తెనాలి నిర్వాహకురాలి అరెస్ట్

image

కానూరులోని జమదగ్ని వీధిలో వ్యభిచార గృహంపై శనివారం పోలీసులు దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. తెనాలికి చెందిన నిర్వాహకురాలు, ఇద్దరు విటులు, మరో మహిళను అరెస్ట్ చేసి, రూ. 2,000 స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.

error: Content is protected !!