News March 21, 2025

పిఎంశ్రీకి జిల్లాలో 40 పాఠశాలలు ఎంపిక: DEO

image

పీఎంశ్రీ పథకంలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో 40 ప్రభుత్వ పాఠశాలలు ఎంపిక అయ్యాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. ఏడు విడతల్లో  మొత్తం 40 స్కూళ్లు ఎంపికైనట్లు చెప్పారు. ఎంపికైన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈనెల 25లోగా https://pmshrischools.education.gov.in వెబ్ సైట్లో నమోదు చేయాలని సూచించారు.

Similar News

News November 21, 2025

మొక్కలకు బోరాన్ ఎందుకు అవసరం?

image

బోరాన్ అనే ఈ సూక్ష్మధాతు మూలకం బోరిక్ యాసిడ్ స్థితిలో మొక్కలకు అందుబాటులోకి వస్తుంది. ఇది మొక్కల్లో, నేలల్లో నిశ్చల స్థితిలో ఉంటుంది. మొక్క ఆకులలో తయారయ్యే ఆహారాన్ని అన్ని భాగాలకు చేరవేయడంలో బోరాన్ కీలక పాత్ర పోషిస్తుంది. మొక్కల సంపర్క ప్రక్రియలో ఉపయోగపడే పుప్పొడి ఉత్పత్తిలో, పుప్పొడి కణాల ఎదుగుదలను నియంత్రిస్తూ విత్తన, పండ్ల ఎదుగుదలను నిలువరిస్తుంది. మొక్క కాల్షియం గ్రహించడానికి తోత్పడుతుంది.

News November 21, 2025

మొక్కల్లో బోరాన్ లోపిస్తే ఏం జరుగుతుంది?

image

బోరాన్ లోపం వల్ల మొక్కలో పెరిగే భాగాలైన వేర్లు, లేత చిగురు, లేత కొమ్మలు, లేత పత్రాలపై ప్రభావం పడుతుంది. ఈ లోపానికి సరైన మొక్కల్లో చిగుర్లు వికృతాకారంలో ఉంటాయి. ఆకులు చిన్నవిగా ఉండి విచ్చుకోకుండా కుచించుకుపోయి కాండపు కణుపు మీద ఉంటాయి. దీని వల్ల మొక్క కురచగా, గుబురుగా కనిపిస్తుంది. చిగుర్ల నుంచి కొమ్మలు ఏర్పడతాయి. లేత ఆకులు ఈనెల మధ్య భాగాలు పసుపు/తెలుపు చారలుగా మారతాయి. తర్వాత ముడుచుకుపోతాయి.

News November 21, 2025

BREAKING: ములుగు ఎస్పీ శబరీష్ బదిలీ.. కొత్త ఎస్పీగా సుధీర్

image

ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీశ్ మహబూబాబాద్ ఎస్పీగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో గతంలో ములుగు అడిషనల్ ఎస్పీగా పని చేసిన సుధీర్ రాంనాథ్ కేకన్‌ను జిల్లా ఎస్పీగా కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో ములుగులో పనిచేసిన అనుభవం నేపథ్యంలో ఆయనను ములుగు జిల్లాకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించింది.