News August 29, 2024

పిచ్చికుక్కను తరుముతూ గుండెపోటుతో రైతు మృతి

image

పిచ్చికుక్కను తరమడానికి వెళ్లి ఓ రైతు మృతిచెందిన ఘటన దేవనకొండ మండలం నేలతలమర్రిలో జరిగింది. బోయ చంద్ర(40) గొర్రెలు పెంచుతున్నాడు. మంగళవారం రాత్రి ఓ పిచ్చికుక్క గొర్రెలను కరవబోతే చంద్ర దానిని తరమడానికి వెళ్లాడు. అది తిరగబడి కరవడానికి రావడంతో పరిగెత్తుతూ గుండెలో నొప్పి వచ్చి పడిపోయాడు. స్థానికులు కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Similar News

News September 19, 2024

కర్నూలు: నేటి నుంచే ఇసుక అమ్మకాలు ప్రారంభం

image

కర్నూలు జిల్లాలో ఇసుక ఆన్లైన్ అమ్మకాలు ఈరోజు సాయంత్రం 3 గంటల నుంచి ప్రారంభమవుతాయని గనులు, భూగర్భ, ఎక్సైజ్ శాఖ డీడీ రాజశేఖర్ తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇసుక బుకింగ్‌లు అందుబాటులో ఉంటాయన్నారు. ఇసుక కొనుగోలుదారులు తహశీల్దారు కార్యాలయాలు, సచివాలయాల్లో బుకింగ్స్ చేసుకోవచ్చని తెలిపారు.

News September 19, 2024

కర్నూలు వ్యవసాయ మార్కెట్ కార్యదర్శిగా జయలక్ష్మి

image

కర్నూలు వ్యవసాయ మార్కెట్ సెలెక్షన్ గ్రేడ్ కార్యదర్శిగా ఆర్.జయలక్ష్మిని నియమిస్తూ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిషనర్ విజయ సునీత ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం జయలక్ష్మి అనంతపురం మార్కెట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. త్వరలో కర్నూలు వ్యవసాయ మార్కెట్ సెలెక్షన్ గ్రేడ్ కార్యదర్శిగా బాధ్యతలు తీసుకోనున్నారు. ప్రస్తుత కార్యదర్శి గోవిందును అనంతపురం బదిలీ చేశారు.

News September 18, 2024

ట్రైనీ ఐపీఎస్‌గా నంద్యాల జిల్లా యువ ఐపీఎస్ మనీషా రెడ్డి

image

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా ఏపీకి నలుగురు ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయించింది. నంద్యాల జిల్లా మహానంది మండలం నందిపల్లెకు చెందిన వంగల మనీషా రెడ్డి ఆ జాబితాలో ఉన్నారు. సొంత రాష్ట్రానికి ట్రైనీ ఐపీఎస్‌గా కేటాయించడంతో నందిపల్లి గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు, పలువురు ఆనందం వ్యక్తం చేశారు.