News January 28, 2025

పిచ్చి మొక్కలను తొలగించి పండ్ల మొక్కలు పెంచాలి: కలెక్టర్

image

వెల్గటూర్ మండలం చెగ్యాం గ్రామంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటించారు. మంగళవారం ఈ సందర్భంగా గ్రామంలోని నర్సరీని, జామ తోటను పరిశీలించారు. పిచ్చి మొక్కలను తొలగించాలని, వివిధ రకాల పండ్ల మొక్కలను పెంచాలని సూచించారు. మొక్కలకు ప్రతిరోజు నీరు పట్టాలన్నారు. ఆయన వెంట ఆర్డీఓ మధుసూదన్, డీపీఓ మదన్మోహన్ తదితర అధికారులు ఉన్నారు.

Similar News

News December 1, 2025

HYD: ఇక పర్యాటక రంగానికి ఏఐ సేవలు

image

రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. దీంట్లో భాగంగా ఏఐ సహాయంతో టూరిస్టులను ఆకర్షించే ప్రయత్నాలు మొదలయ్యాయి. టూరిస్టులు చూసే ప్రదేశాలు సమయం చెప్తే దానికి తగ్గట్టుగా వారి ప్రయాణాన్ని నిర్ణయిస్తుంది. దక్కన్ ఎక్స్‌ప్లోరర్ తన కార్డుతో ఈ సేవలను అందించడానికి రూపకల్పన చేస్తున్నారు. అలాగే నగరంలోని వివిధ ప్రాంతాల్లో నైట్ టూరిజంను పెంచేందుకు చూస్తోంది.

News December 1, 2025

ములుగు: వాళ్లెందుకో వెనుకబడ్డారు..!

image

జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎక్కడో వెనకబడిందా..!? అనే సందేహాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కూడా ఆపార్టీ నేతలు ప్రభావవంతంగా పని చేయడం లేదనే విమర్శలున్నాయి. జిల్లా అధ్యక్షుడు/ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మధ్య విబేధాలే కారణంగా తెలుస్తోంది. ఓ నేతకు ఆర్థిక సమస్య ఇబ్బందిగా మారిందని కేడర్ గుసగుసలాడుతోంది.

News December 1, 2025

మాయదారి మహమ్మారికి ఆరేళ్లు..!

image

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ‘కరోనా’ మహమ్మారిని నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. చైనా వుహాన్‌లో తొలి కరోనా కేసు నమోదై నేటికి ఆరేళ్లు. 2019లో మొదలైన ఈ మహమ్మారి అతి తక్కువ కాలంలోనే ప్రపంచాన్ని చుట్టుముట్టింది. 70లక్షల మంది ప్రాణాలను హరించి, కోట్లాది మందిని రోడ్డున పడేసింది. భారీ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్న మానవాళి.. టీకాలు, ఆరోగ్య నియమాలతో పోరాడి గెలిచింది. కరోనా మీ జీవితంలో ఎలాంటి మార్పులు తెచ్చింది?