News November 15, 2024
పిచ్చి లేఖలు రాయడం మానుకోండి: బుద్ధా వెంకన్న
విజయవాడ: సూపర్ సిక్స్ పథకాల హామీలు అమలు చేయాలంటూ సీఎం చంద్రబాబుకు వైసీపీ నేత ముద్రగడ లేఖ రాశారు. ఈ లేఖకు టీడీపీ నేత బుద్ధా స్పందించి శుక్రవారం ఘాటుగా సమాధానమిచ్చారు. ‘అధికారం కోసం కాదు, ప్రజల కోసమే సూపర్ సిక్స్’ హామీలని బుద్ధా తెలిపారు. టీడీపీ, మా కులం బీసీ.. ఇలాంటి పిచ్చి లేఖలు రాయడం మానుకోవాలని బుద్ధ ముద్రగడ లేఖపై ఘాటుగా కౌంటరిచ్చారు.
Similar News
News December 11, 2024
విజయవాడ: వైసీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డికి షాక్
తనపై నమోదైన హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వైసీపీ నేత పూనురు గౌతమ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను బుధవారం విచారించిన హైకోర్టు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. కాగా బాధితుడు ఉమామహేశ్వరశాస్త్రి హత్యకు గౌతమ్ రెడ్డి కుట్ర పన్నారని, ఘటనకు సంబంధించిన CC ఫుటేజ్, ఫోటోలు ఉన్నాయని ప్రభుత్వ తరఫు న్యాయవాది ఈ కేసు వాదనలో భాగంగా గతంలోనే న్యాయస్థానానికి విన్నవించారు.
News December 11, 2024
కృష్ణాజిల్లా వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
కృష్ణాజిల్లా వైద్య ఆరోగ్య శాఖలో 22 పోస్టుల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DMHO డా. గీతాబాయి తెలిపారు. ల్యాబ్ టెక్నిషియన్ గ్రేడ్-2 నాలుగు పోస్టులు, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ ఎనిమిది పోస్టులు, శానిటరీ అటెండర్ కం వాచ్‌మెన్ 10 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. ఆసక్తి, అర్హత గల వారు ఈనెల 16లోపు డీఎంహెచ్ఓ కార్యాలయంలో అందజేయాలన్నారు.
News December 11, 2024
కృష్ణా: వెన్నెల AC స్లీపర్ సర్వీసును ఆదరించండి
ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ నుంచి ప్రతి రోజూ విశాఖపట్నంకు వెన్నెల AC స్లీపర్ బస్సు నడపుతున్నామని RTC తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. రాత్రి 11 గంటలకు విజయవాడలో బయలుదేరే ఈ బస్సు తర్వాతి రోజు ఉదయం 6 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుందని, విశాఖలో రాత్రి 10.45కి బయలుదేరి తర్వాత రోజు ఉదయం 05.35కి విజయవాడ వస్తుందని, ఈ సర్వీసును ప్రజలు ఆదరించాలని RTC అధికారులు విజ్ఞప్తి చేశారు.