News April 10, 2025
పిటిషన్లపై సత్వర చర్యలకు కృషి: KMR SP

సమస్యలపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు ఇస్తున్న సందర్భంలో పూర్తి చిరునామా, మొబైల్ నంబర్‌ను స్పష్టంగా పేర్కొనాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఓ ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదుదారుల పట్ల పారదర్శకత, వేగవంతమైన స్పందన, ప్రజలతో సమర్థమైన సమాచార పంపిణీ కోసం ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. ప్రజల సహకారంతో పోలీసు శాఖ మరింత సమర్థంగా సేవలందించగలదని వెల్లడించారు.
Similar News
News November 23, 2025
రేపు వాయుగుండం.. 48 గంటల్లో తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మలక్కా, సౌత్ అండమాన్ మీదుగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. ఇది వాయవ్యదిశగా కదులుతూ రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా కొనసాగుతూ 48 గంటల్లో తుఫాన్‌గా బలపడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.
News November 23, 2025
జీపీవోల సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్‌గా శ్రీనివాస్

గ్రామ పాలనాధికారుల(జీపీవో) సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్‌గా జనగామకు చెందిన పెండెల శ్రీనివాస్ నియమితులయ్యారు. తనపై నమ్మకంతో ఉమ్మడి జిల్లా బాధ్యతలు అప్పగించిన ఆ సంఘం రాష్ట్ర నాయకత్వానికి కృతఙ్ఞతలు తెలిపారు. జీపీవోల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.
News November 23, 2025
సాయి సేవా స్ఫూర్తితోనే అభివృద్ధి: సీఎం చంద్రబాబు

మన ముందు నడయాడిన దైవం శ్రీ సత్యసాయిబాబా శత జయంతి సందర్భంగా ఆయన చూపిన సేవా మార్గాన్ని స్మరించుకుందామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విద్య, వైద్యం, తాగునీరు వంటి సేవలతో ‘మానవ సేవే మాధవ సేవ’ అని బాబా నిరూపించారని తెలిపారు. సత్యసాయి సిద్ధాంతం ద్వారా ప్రపంచానికి జ్ఞానం, సన్మార్గం లభించాయని, ఆయన స్ఫూర్తితోనే రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని సీఎం దివ్యాంజలి ఘటించారు.


