News January 19, 2025
పిట్టలవానిపాలెంలో రోడ్డు ప్రమాదం

పిట్టలవానిపాలెం మండలం భావనారాయణపాలెం గ్రామపంచాయతీ పరిధిలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ యువకుడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఘటనకు సంబంధించి పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 13, 2025
గుంటూరు: వేసవి తాపాన్ని తీరుస్తున్న పుచ్చకాయలు

గుంటూరు జిల్లా వ్యాప్తంగా పుచ్చకాయలు అందుబాటులో ఉన్నాయి. వేసవి తాపం నుంచి ఉపశమనంతో పాటు పోషక విలువ అధికంగా ఉండడంతో వీటి కొనుగోలు కోసం ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. కిలో పుచ్చకాయ ధర రూ.40 నుంచి రూ.45 పలుకుతోంది. ధరలు కాస్తా అధికంగా ఉన్నప్పటికీ ప్రజలు తింటున్నారు. ఎండ వేడిమిని తట్టుకోవడానికి ఇవి ఎంతో మేలు చేస్తాయని ప్రజలు భావిస్తున్నారు. వ్యాపారులు పెద్ద ఎత్తున దిగుమతి చేసుకొని విక్రయిస్తున్నారు.
News February 13, 2025
గుంటూరు: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. చికెన్, గుడ్ల ధరలపై ప్రభావం

గోదావరి జిల్లాలో కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తి చెందుతున్న వదంతులతో చికెన్ తినాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. అయితే ఈ ఫ్లూ ప్రభావం ఉమ్మడి గుంటూరు జిల్లాపై ఎక్కడా లేదని, వదంతులు నమ్మొద్దని అధికారులు సూచిస్తున్నారు. అయితే చికెన్ ధరలు రూ.50 వరకు తగ్గడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఇటు గుడ్డు ధర కూడా రూ.4.50కి దిగివచ్చింది. మీ ఏరియాలో ధరలెలా ఉన్నాయి.
News February 13, 2025
గుంటూరు: తల్లి మందలించిందని కుమారుడు సూసైడ్

తల్లి మందలించిందని కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని జన్మభూమి నగర్‌లో జరిగింది. పూర్ణ కుమార్(20) పనికి వెళ్లడం లేదని బుధవారం తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన పూర్ణ కుమార్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పనికి వెళ్లి తిరిగొచ్చిన తల్లి కుమారుడు విగతజీవిగా ఉండడాన్ని చూసి నిశ్చేష్ఠురాలైంది. ఘటనపై ఆమె ఫిర్యాదుతో కేసు నమోదైంది.