News May 14, 2024
పిట్లంలో రోడ్డు ప్రమాదం
కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పిట్లంలో పోతిరెడ్డి పల్లి తండాలో మంగళవారం రాత్రి బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి ఆగి ఉన్న లారీని ఢీ కొన్నట్లు స్థానికులు తెలిపారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు నిజాంసాగర్ మండలం నర్సింగ్‌రావు పల్లి గ్రామానికి చెందిన బోట్ల పండరి(29)గా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.
Similar News
News January 23, 2025
రామారెడ్డి: హత్య కేసులో ఐదుగురు అరెస్ట్
హత్య కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు KMR అదనపు SP చైతన్య రెడ్డి తెలిపారు. రామారెడ్డి మండలం అన్నారానికి చెందిన పొక్కిలి రవి(41)ని అతడి అన్న కిష్టయ్యా ఈనెల 19న హత్య చేయించాడు. వారి మధ్య భూతగాదాలు ఉండటంతో కిష్టయ్య, అతడి భార్య సత్తవ్వ, కుమారుడు కిషన్ కలిసి షేక్ అఫీజ్, నరేశ్‌కు సుపారీ ఇచ్చి హత్య చేయించారు. కేసు నమోదు చేసిన రామారెడ్డి SI నరేష్ వారిని అరెస్టు చేశారు.
News January 23, 2025
NZB: కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
నిజామాబాద్ శివారులోని నాగారం తెలంగాణ మైనార్టీ జూనియర్ కళాశాల బాలుర-1లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం విద్యార్థులు నేరుగా దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ సయ్యద్ హైదర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపులలో ప్రవేశాల కోసం ప్రస్తుతం10వ తరగతి చదువుతున్న ముస్లీం, క్రిస్టియన్, సిక్కు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు.
News January 23, 2025
ధర్పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సస్పెన్షన్
ధర్పల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గణా జ్యోతి రాణిని బుధవారం సస్పెండ్ చేస్తూ ప్రాంతీయ విద్యాశాఖ సంచాలకులు సత్యనారాయణ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జ్యోతి రాణి ధర్పల్లి పాఠశాలకు వచ్చినప్పటి నుంచి ఆమె విపరీత ప్రవర్తనతో ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆమె చేస్తున్న అవకతవకలపై ఎమ్మెల్యే భూపతిరెడ్డి, డీఈవో, కలెక్టర్కు ఉపాధ్యాయులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.