News November 26, 2024

పిట్లం: అంగన్వాడీ సెంటర్లో కాలం చెల్లిన పాల ప్యాకెట్ల సరఫరా..!

image

పిట్లంలోని ఓ అంగన్వాడీ సెంటర్లో కాలం చెల్లిన పాల ప్యాకెట్లు సరఫరా చేసిన ఘటన వెలుగు చూసింది. గ్రామానికి చెందిన పలువురు గర్భిణీలు సోమవారం అంగన్వాడీకి వచ్చి టెట్రా పాల డబ్బాలు తీసుకెళ్లారు. తీరా ఇంటికి వెళ్లి చూసే సరికి కాల పరిమితి ముగిసిపోయినట్లు గమనించి పడేశారు. ఇలాంటి పాల ప్యాకెట్లు సరఫరా చేస్తారా..? అని గర్భిణీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News December 20, 2025

బోధన్: ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులకు నోటీసులు

image

బోధన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఇటీవల ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు పరస్పరం గొడవకు దిగారు. ఈ ఘటనపై ఒకరిపై మరొకరు బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో మున్సిపల్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గొడవపడిన ఇద్దరు ఉద్యోగులకు నోటీసులు జారీ చేసినట్లు మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ తెలిపారు.

News December 20, 2025

NZB: ఎల్లుండి నుంచి యథావిధిగా ప్రజావాణి: కలెక్టర్

image

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 22 (సోమవారం) నుంచి యథావిధిగా నిర్వహించడం జరుగుతుందని NZB కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసినందున ప్రజావాణి కార్యక్రమం తిరిగి యథావిధిగా కొనసాగుతుందని చెప్పారు.

News December 20, 2025

NZB: లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా జడ్జి

image

జిల్లాలోని కోర్టుల్లో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని NZB జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరత లక్ష్మి సూచించారు. ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. నిజామాబాద్‌లో 9, బోధన్‌లో 4, ఆర్మూర్‌లో 2 బెంచ్‌లు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి సాయిసుధ పాల్గొన్నారు.