News January 29, 2025

పిట్లం: అడవికి నిప్పు.. పట్టించుకోని అధికారులు

image

పిట్లం మండలం కిష్టాపూర్, చిన్న కొడప్గల్ శివారులోని అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం మధ్యాహ్నం నిప్పుపెట్టారు. ఈ మంటలు అడవి మొత్తం వ్యాపిస్తున్నాయి. ఆ పక్కనే పంట పొలాలు ఉండటంతో రైతులు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి అయినప్పటికీ మంటలు అదుపు అవ్వడం లేదు. ఈ విషయమై అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News February 13, 2025

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి.. నేడు నిందితుల బెయిల్‌పై తీర్పు

image

టీడీపీ గన్నవరం నియోజకవర్గ కార్యాలయంపై దాడి కేసులో నిందితుల బెయిల్‌పై ఇవాళ తీర్పు వెలువడనుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తాజాగా అరెస్ట్ చేశారు. కేసులో 88 మందిని నిందితులుగా చేర్చగా ఇప్పటికే 45మందిని అరెస్ట్ చేశారు. కాగా ఫిర్యాదుదారుడు సత్యవర్దన్ తనకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని, భయపెట్టి ఫిర్యాదు చేయించారని సోమవారం న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే.

News February 13, 2025

రాజాం : తండ్రిని చూసేందుకు వెళ్లి దారిలో మృతి

image

రాజాం కాంప్లెక్స్ ఆవరణలో కాలువలో బుధవారం మెరకముడిదాంకి చెందిన మజ్జి రామకృష్ణ మృతి చెందిన విషయం <<15436428>>తెలిసిందే<<>>. శ్రీకాకుళంలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రిని చూసేందుకు రామకృష్ణ రాజాం వచ్చాడు. కాంప్లెక్స్‌లో బైక్ ఉంచి బస్సులో వెళ్లాడు. రాత్రి తిరిగి కాంప్లెక్స్‌కి చేరుకున్నాడు. ఈక్రమంలో గుండెపోటు వచ్చి కాలువలో పడిపోగా ఎవరు చూడకపోవడంతో మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

News February 13, 2025

కాసేపట్లో మోదీ, ట్రంప్ కీలక భేటీ

image

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ కాసేపట్లో అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఇరు దేశాల అధినేతలు చర్చించనున్నారు. వలస విధానం, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ల తరలింపు, ట్రేడ్, టారిఫ్స్, విదేశాంగ విధానాలపై చర్చలు జరపనున్నారు. ఇప్పటికే భారత్ ఖరీదైన బైకులపై టారిఫ్స్ తగ్గించింది. ఈ పర్యటన తర్వాత మరిన్ని దిగుమతులపై టారిఫ్ తగ్గించే అవకాశం ఉంది.

error: Content is protected !!