News January 29, 2025
పిట్లం: అడ్డొచ్చిన కుక్క.. ఇద్దరికి గాయాలు

పిట్లం శివారులోని హైవే-161 పై కుక్క అడ్డు రావడంతో బైక్ అదుపు తప్పిపడి ఇద్దరికి గాయాలయ్యాయి. వివరాలిలా.. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం బోర్గికి చెందిన శ్యామ్ రావు బైక్‌పై తన భార్యతో కలిసి పిట్లం నుంచి స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో కుక్క అడ్డు రావడంతో అదుపుతప్పి పడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. హైవే సిబ్బంది చికిత్స నిమిత్తం పిట్లం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Similar News
News October 30, 2025
మణుగూరు వద్ద గ్యాస్ సిలిండర్ల లారీ బోల్తా

మణుగూరులోని అశోక్‌నగర్ సాయిబాబా గుడి వద్ద ఈరోజు పెను ప్రమాదం తృటిలో తప్పింది. సుమారు 340 వంట గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న ఒక లారీ అదుపు తప్పి బోల్తా పడింది. సిలిండర్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడటంతో స్థానికులు భయాందోళన చెందారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
News October 30, 2025
మేడిపల్లిలో ACBకి చిక్కిన విద్యుత్ అధికారి

యాదరిగిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విద్యుత్ శాఖ SE వెంకటరామారావు HYD శివారు మేడిపల్లిలో లంచం తీసుకుంటూ ACB అధికారులకు పట్టుబడ్డాడు. మేడిపల్లికి చెందిన ఓ వ్యక్తికి యాదాద్రి ఆలయ పులిహోర యంత్రాల నిర్వహణ కాంట్రాక్టు దక్కింది. రూ.10 లక్షల బిల్లుల మంజూరుకు వెంకటరామారావు 20% లంచం డిమాండ్ చేశాడు. మేడిపల్లి మారుతీనగర్‌లో రూ.1.90 లక్షలు స్వీకరిస్తుండగా ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాడు.
News October 30, 2025
సంగారెడ్డి: ఈ ఖరీఫ్ సీజన్ మొత్తం కష్టాలే

ఈ ఖరీఫ్ సీజన్ మొదలైనప్పటి నుంచి సంగారెడ్డి జిల్లా రైతులకు కష్టాలు ఎదురవుతున్నాయి. మొదట వర్షాలు కురువకపోగా ఋతుపవనాలు లేటుగా ప్రవేశించాయి. దీంతో వరి నాట్లు లేటుగా వేశారు. వేసిన నాట్లకి చల్లడానికి యూరియా సరఫరా రాకపోవడంతో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మొంథా తుపాన్‌తో ధాన్యం తడవడంతో కన్నీళ్లే మిగిలాయి. రైతన్నకు ఈ ఖరీఫ్ సీజన్ అంత కలిసి రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


