News January 29, 2025
పిట్లం: అడ్డొచ్చిన కుక్క.. ఇద్దరికి గాయాలు

పిట్లం శివారులోని హైవే-161 పై కుక్క అడ్డు రావడంతో బైక్ అదుపు తప్పిపడి ఇద్దరికి గాయాలయ్యాయి. వివరాలిలా.. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం బోర్గికి చెందిన శ్యామ్ రావు బైక్‌పై తన భార్యతో కలిసి పిట్లం నుంచి స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో కుక్క అడ్డు రావడంతో అదుపుతప్పి పడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. హైవే సిబ్బంది చికిత్స నిమిత్తం పిట్లం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Similar News
News February 15, 2025
సామర్లకోట: రైలు ఎక్కుతూ యువకుడు మృతి

యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ నాయకర్ కాలనీకి చెందిన వాకాడ జాన్ బాబు (27) శనివారం ఉదయం సామర్లకోట రైల్వే స్టేషన్‌లో నూజివీడు వెళ్లేందుకు తన తండ్రి, భార్య, కుమారుడితో కలిసి ట్రైన్ ఎక్కుతుండగా జారి పడిపోయాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో అతని తండ్రి, భార్య నిశ్చేష్టులయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి డెడ్‌బాడీని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
News February 15, 2025
గిరిజనుల్లో పేదరికాన్ని రూపుమాపుతాం: సీఎం

సమగ్ర ప్రణాళికతో గిరిజనుల్లో పేదరికాన్ని నిర్మూలిస్తామని, గిరిజన చట్టాలను కాపాడతామని సీఎం చంద్రబాబు అన్నారు. శనివారం బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా ఉండవల్లిలోని నివాసంలో సేవాలాల్‌కు నివాళులర్పించారు. సీఎం మాట్లాడుతూ.. గిరిజనులను ఆర్థికంగా ఆదుకునేందుకు ఎన్టీఆర్ అనేక సంక్షేమాలు అమలు చేశారన్నారు. ఆయన స్పూర్తితో గిరిజనులకు రాజకీయ అవకాశాలు కల్పించి అండగా నిలిచామన్నారు.
News February 15, 2025
KMR: లైంగిక దాడులను అరికట్టాలి: అదనపు కలెక్టర్

పాఠశాలలలో పిల్లలపై జరిగే లైంగిక దాడులను అరికట్టే దిశగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ సూచించారు. కలెక్టరేట్‌లో ఫోక్సో చట్టంపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ హాజరై.. చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్‌కి బ్యాడ్జీలు ప్రధానం చేశారు. జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, తదితరులు పాల్గొన్నారు.