News September 13, 2024
పిట్లం: తల్లి దండ్రులు మందలించారని సూసైడ్

తల్లి దండ్రులు మందలించారని మనస్తాపంతో కొడుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పిట్లం మండలం తిమ్మానగర్లో శుక్రవారం జరిగింది. ఎస్సై రాజు వివరాలిలా.. తిమ్మనగర్ వాసి బొమ్మల నాందేవ్ (23) పనిచేయకుండా ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్నాడు. ఈ విషయంలో తల్లి దండ్రులు మందలించగా.. గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
Similar News
News October 26, 2025
కాంగ్రెస్ మునిగిపోయే నావ: కవిత

కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని, వారితో తనకు పని లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ… అనుకోకుండా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అధికారాన్ని కాపాడుకోలేకపోతోందని విమర్శించారు. ఆ పార్టీకి ప్రజల నుంచే దిక్కు లేదని, తనకు మద్దతు తెలుపుతున్నారన్న దాంట్లో వాస్తవం లేదని ఆమె ఎద్దేవా చేశారు.
News October 26, 2025
నిజామాబాద్: బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి: కవిత

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం నిజామాబాద్ ఎంపీ అర్వింద్ రాజీనామాతో శ్రీకారం చుట్టాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. ఆదివారం ఆమె నిజామాబాద్ నగర శివారులోని ఓ హోటల్లో మీడియాతో మాట్లాడారు. ఎంపీ అర్వింద్తో పాటు తెలంగాణలోని బీజేపీకి చెందిన 8 మంది రాజీనామా చేస్తే బీసీ రిజర్వేషన్లు నడుచుకుంటూ వస్తుందన్నారు. తక్షణమే వారు రాజీనామా చేయాలన్నారు.
News October 26, 2025
నిజామాబాద్: ముంపు రైతులకు రూ.50 వేలు చెల్లించాలి: కవిత

ప్రభుత్వం చేసిన పాపం కారణంగానే రైతులకు నష్టం జరిగిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. శనివారం సాయంత్రం ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ ముంపు ప్రాంతం యంచలో పర్యటించారు. బాధిత రైతులకు ఎకరాకు రూ.50 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గోదావరి పరీవాహాక ప్రాంతం నవీపేట మండలంలో గతంలో ఎన్నడూ లేనంత నష్టం జరిగిందన్నారు. ఇది దేవుడు చేసింది కాదన్నారు.


