News November 19, 2024
పిట్లం: నేడే AMC పాలకవర్గ ప్రమాణ స్వీకారం
పిట్లం మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం నేడు జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి.. మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని మార్కెట్ కమిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ చికోటి మనోజ్, కృష్ణారెడ్డి కోరారు.
Similar News
News December 11, 2024
ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించిన అదనపు కలెక్టర్
ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.విక్టర్ అన్నారు. బుధవారం రామారెడ్డి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే తీరును ఆయన పరిశీలించారు.లబ్ధిదారుల భూముల వివరాలను పరిశీలించాలని తెలిపారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఆయన పరిశీలించారు.
News December 11, 2024
NZB: చర్చనీయాంశంగా మారిన ఫ్లెక్సీలు
నిజామాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు పెట్టిన ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి. ‘జిల్లాలో పర్యాటక రంగంపై రెడ్ టేపిజం అని, కొంతమంది అధికారుల చేతుల్లో చిక్కిన పర్యాటకరంగం.. త్వరలో అన్ని అధారాలతో మీ ముందుకు’ అని పలు చౌరస్తాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. కాగా ప్రస్తుతం పట్టణంలో ఇవి ఎవరు పెట్టారు? కారణమేంటని పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.
News December 11, 2024
NZB: UPDATE.. ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
జక్రాన్‌పల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మృతి చెందిన వారు నిజామాబాద్‌కు చెందిన కస్తూరి ప్రమోద్, అంకడి సంజయ్ గా గుర్తించినట్లు ఎస్ఐ తిరుపతి తెలిపారు. ఈ ఇద్దరు జక్రాన్ పల్లి నుంచి నిజామాబాద్ వైపు బైకుపై వెళ్తుండగా సికింద్రాపూర్ 44 జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టారని వెల్లడించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై పేర్కొన్నారు.