News January 31, 2025
పిట్లం: పాము కాటుతో వృద్ధుడి మృతి..

పిట్లం మండలం బుర్నాపూర్ గ్రామానికి చెందిన వృద్ధుడు ఒర్రె మొగులయ్య (80) పాముకు కాటుకు గురై ప్రాణాలు వదిలారు. స్థానికుల వివరాలిలా..ఒర్రె మొగులయ్య బుధవారం రాత్రి ఇంట్లో పడుకున్నాడు. అదే సమయంలో పాము కాటు వేసింది. వెంటనే చికిత్స నిమిత్తం పిట్లం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ ప్రాణాలు వదిలారు.
Similar News
News February 12, 2025
అనంత: ‘బ్రహ్మోత్సవాల్లో తప్పిపోయిన బాలుడు.. వివరాలు తెలిస్తే చెప్పండి’

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో జరుగుతున్న శ్రీ కొండ మీదరాయుడి బ్రహ్మోత్సవాల్లో ఓ బాలుడు తప్పిపోయాడు. కనీసం తల్లిదండ్రుల పేర్లు కూడా చెప్పలేని స్థితిలో ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఎవరికైనా వివరాలు తెలిస్తే బుక్కరాయసముద్రం సీఐకి సమాచారం అందించాలని తెలిపారు.
News February 12, 2025
భద్రాచలం రాములవారి పెళ్లికి గజ్వేల్ నుంచి తలంబ్రాలు..

శ్రీరామనవమి రోజు రాములవారి కళ్యాణం కోసం వాడే గోటి తలంబ్రాల(గోటితో వలిచిన బియ్యం)ను వలిచే అవకాశాన్ని ఈసారి గజ్వేల్‌లోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థకు భద్రాచల దేవస్థానం కల్పించింది. ఈ మేరకు 250కిలోల వడ్లను గోటితో వలచి తలంబ్రాలుగా మలచనున్నారు. ఈ మహత్కార్యంలో పాల్గొనే అవకాశం వచ్చిన శ్రీరామకోటి భక్త సమాజం సభ్యులు రామారాజును ఎమ్మెల్సీ యాదవరెడ్డి బుధవారం సన్మానించి అభినందించారు.
News February 12, 2025
KMR: యాక్సిడెంట్‌లో వ్యక్తి మృతి

వర్ని మండలం జాకోరా ఎక్స్ రోడ్డు వద్ద బుధవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మరణించాడు. స్థానికులు 108కు, పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే వ్యక్తి మృతి చెందినట్లు 108 సిబ్బంది తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వివరించారు. వ్యక్తిని గుర్తించిన వారు వర్ని పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్‌ఐ రమేశ్ పేర్కొన్నారు.