News September 25, 2024

పిట్లం: పింఛన్ ఇప్పించండి మేడం.. వృద్ధురాలి ఆవేదన

image

పిట్లంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి బుధవారం పర్యటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పిట్లం కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఇదే సమయంలో అక్కడే అన్న వాలీబాయి అనే వృద్ధురాలు సబ్ కలెక్టర్‌తో ఆమె ఆవేదనను వ్యక్తం చేసింది. తనకు ఎలాంటి ఆధారం లేదని, కనీసం పింఛన్ ఐనా ఇప్పించండి మేడం అని తన బాధను వెల్లబుచ్చింది. స్పందించిన సబ్ కలెక్టర్ ఆమెకు పించన్ ఇప్పించాలని ఎంపీడీవోకు ఆదేశించారు.

Similar News

News November 7, 2025

పసుపు సాగు పొలాలను సందర్శించిన ఎంపీ అర్వింద్

image

కమ్మర్ పల్లి మండల కేంద్రంలో పసుపు సాగు పొలాలను ఎంపీ అర్వింద్, జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి శుక్రవారం సందర్శించారు. రైతులతో మాట్లాడి పసుపు ధరల పరిస్థితి, ఆకుల నుంచి నూనె తీసి అదనపు ఆదాయం పొందే యోచన గురించి తెలుసుకున్నారు. అలాగే, బోర్డు శాశ్వత కార్యాలయానికి స్థలం కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఛైర్మన్‌ను అడిగి తెలుసుకున్నారు.

News November 7, 2025

MP అర్వింద్ ధర్మపురి ఘాటు వ్యాఖ్యలు

image

గత BRS ప్రభుత్వంపై నిజామాబాద్ MPఅర్వింద్ ధర్మపురి ఘాటు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ KCR తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నాశనం చేశారని ఆరోపించారు. KCR కుటుంబం చేసిన పాపానికి CM రేవంత్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం రేవంత్ చేస్తున్న అతిపెద్ద పాపమని అన్నారు. రాబోయే రోజుల్లో ఈ పాపం రేవంత్ రెడ్డికి కచ్చితంగా చుట్టుకుంటుందని పేర్కొన్నారు.

News November 7, 2025

NZB: ఐడీఓసీలో “వందేమాతరం” గేయాలాపన

image

“వందేమాతరం” జాతీయ గేయాన్ని రచయిత బంకిమ్‌ చంద్ర ఛటర్జీ రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో వందేమాతరం గేయాన్ని సామూహికంగా ఆలపించారు. కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది అందరూ స్వచ్ఛందంగా పాల్గొని దేశభక్తి భావాన్ని చాటిచెప్పారు.