News February 21, 2025
పిట్లం: ప్రతిభ.. పతకాల పంట పండిస్తోంది..!

కిక్ బాక్సింగ్, చెస్ బాక్సింగ్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఇలా.. 8 రకాల క్రీడల్లో సత్తా చాటుతోంది కామారెడ్డి జిల్లా పిట్లం వాసి తక్కడ్ పల్లి ప్రతిభ. అనితర సాధ్యమైన విజయాలతో పతకాల పంట పండిస్తోంది. ఈ నెల 19న ఖేలో ఇండియా రాష్ట్ర స్థాయి వుమెన్ వుషూ లీగ్ పోటీలు ఆదిలాబాద్ లో జరిగాయి. ఈ పోటీల్లో ప్రతిభ 45 కేజీ ల విభాగంలో రాణించి పసిడి పతకాన్ని ముద్దాడింది. దీంతో ఆమె ఖేలో ఇండియా స్కాలర్షిప్కు ఎంపికైంది.
Similar News
News November 9, 2025
తంబళ్లపల్లి: ‘టమాటా రైతులను ఆదుకోండి’

టమాటా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. తంబళ్లపల్లి (M)లో టమాటాను పండించిన రైతులు తుఫాన్ ప్రభావంతో గిట్టుబాటు ధరల్లేక రోడ్లపై పడేస్తున్నామంటున్నారు. గుండ్లపల్లి, గోపిదిన్నె, కన్నెమడుగు, కొటాల తదితర పంచాయతీల్లో సుమారు వెయ్యి ఎకరాలకు పైగా రైతులు పంటలు వేశామన్నారు. ఎకరాకు రూ.2 లక్షలు వరకు ఖర్చును ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందన్నారు.
News November 9, 2025
సిద్దిపేట: ఈనెల 15న స్పెషల్ లోక్ అదాలత్

నవంబర్ 15న స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు సిద్దిపేట సీపీ విజయ్ కుమార్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో పెండింగ్లో ఉన్న 2230 కాంపౌండబుల్ కేసుల్లో రాజీ పడవచ్చని, ఈనెల 15 వరకు ప్రతి రోజు లోక్ అదాలత్ జరుగుతుందన్నారు. చిన్న చిన్న కేసుల్లో కోర్ట్ చుట్టూ తిరుగుతున్న ప్రజలకి ఇదొక మంచి అవకాశమని, రాజీ పడదగిన కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు.
– SHARE IT
News November 9, 2025
ములుగులో బాలుడి మృతికి వైద్యుడి నిర్లక్ష్యమే కారణమా?

కన్నాయిగూడెం మండలం గూరేవులకు చెందిన హరినాథ్(7) పాముకాటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. బాలుడి మృతికి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. పాముకాటుకు వైద్యుడి పర్యవేక్షణలో యాంటీ డోస్ ఇవ్వాల్సి ఉండగా, ఆ సమయంలో డాక్టర్ అందుబాటులో లేకపోవడం, ఉన్న సిబ్బంది సరైన రీతిలో స్పందించక పోవడంతో ఈ దారుణం జరిగిందని వారు వాపోతున్నారు.


