News January 18, 2025
పిట్లం: మేనత్త హత్య.. నిందితుడి అరెస్టు

మహిళను హత్య చేసిన నిందితుడిని శుక్రవారం రిమాండ్ చేసినట్లు బాన్సువాడ రూరల్ సీఐ రాజేష్ తెలిపారు. గురువారం చిన్న కొడప్గల్కు చెందిన గొరిగే సత్యవ్వ(55) వ్యక్తి హత్య చేసిన విషయం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా శుక్రవారం పిట్లంలో గొరిగే రవిని అదుపులో తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తాగుడుకు బానిసై మేనత్తను హత్య చేసి, ఆభరణాలను అపహరించినట్లు సీఐ వెల్లడించారు.
Similar News
News September 14, 2025
నిర్మల్ జిల్లా వర్షపాతం వివరాలు

గడిచిన 24 గంటల్లో నిర్మల్ జిల్లాలో 227.2 మి.మి వర్షపాతం నమోదైంది. మండలాల వారిగా నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. కుబీర్ మండలంలో అత్యధికంగా 30.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, పెంబిలో 25.8, కుంటాల 25.6, మామాడ 19.6, దస్తురాబాద్ 17.2, భైంసా 16.4, సారంగాపూర్ 15.6, దిలావర్పూర్, నిర్మల్ రూరల్ మండలంలో 14.2 మి.మీ వర్షపాతం నమోదుయింది.
News September 14, 2025
కలెక్షన్లలో దుమ్మురేపుతోన్న ‘మిరాయ్’

తేజా సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఫాంటసీ మూవీ ‘మిరాయ్’ కలెక్షన్లలో దుమ్మురేపుతోంది. ఈ చిత్రం రెండు రోజులకు వరల్డ్ వైడ్గా ₹55.60 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ తెలిపారు. పాజిటివ్ టాక్ రావడం, వీకెండ్ కూడా కావడంతో వసూళ్లు ఇంకా పెరుగుతాయని వారు భావిస్తున్నారు. మంచు మనోజ్ కీలక పాత్రలో, రితికా నాయక్ హీరోయిన్గా నటించారు.
News September 14, 2025
సెప్టెంబర్ 17 నుంచి స్వస్త్ నారీ-సశక్త్ పరివార్: కలెక్టర్

జనగామ జిల్లాలో స్వస్త్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమమని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహిస్తామని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలు, పిల్లల ఆరోగ్య సాధికారత కోసం శిబిరాలు ఏర్పాటు చేసి స్క్రీనింగ్ చేయనున్నట్లు వివరించారు. ANC తనిఖీలు చేపట్టి రోగనిరోధక శక్తిపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 1న మెగా రక్తదానం కూడా జరుగుతుందన్నారు.