News January 18, 2025
పిట్లం: మేనత్త హత్య.. నిందితుడి అరెస్టు

మహిళను హత్య చేసిన నిందితుడిని శుక్రవారం రిమాండ్ చేసినట్లు బాన్సువాడ రూరల్ సీఐ రాజేష్ తెలిపారు. గురువారం చిన్న కొడప్గల్‌కు చెందిన గొరిగే సత్యవ్వ(55) వ్యక్తి హత్య చేసిన విషయం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా శుక్రవారం పిట్లంలో గొరిగే రవిని అదుపులో తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తాగుడుకు బానిసై మేనత్తను హత్య చేసి, ఆభరణాలను అపహరించినట్లు సీఐ వెల్లడించారు.
Similar News
News February 8, 2025
బాలుడి మర్మాంగాన్ని కోరికిన పెంపుడు కుక్క..!

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో దారుణ ఘటన జరిగింది. కుంట గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలుడు లక్ష్మయ్య ఇంట్లో నిద్రిస్తుండగా వారు పెంచుకునే కుక్క మర్మాంగాన్ని కొరికింది. కుటుంబీకులు బాలుడిని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు బాలుడి మర్మాంగానికి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ తెలిపారు.
News February 8, 2025
తొలిసారి ‘ఆప్’కు 48 రోజులే అధికారం

మూడో సారి అధికారం చేజిక్కించుకోవడానికి CM పదవికి సైతం దూరంగా ఉంటూ అరవింద్ కేజ్రీవాల్ వ్యూహప్రతివ్యూహాలు రచించారు. BJPపై ఘాటు విమర్శలు చేస్తూనే హామీలు గుప్పించారు. కాగా, తొలిసారి 2013లో అధికారం చేపట్టిన ఆప్ కాంగ్రెస్ మద్దతుతో కేవలం 48 రోజులే అధికారంలో ఉంది. 2014లో ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించారు. ఆపై 2015 నుంచి రెండు సార్లు విజయం సాధించింది. నాలుగోసారి ఆప్ గెలుస్తుందని అనుకుంటున్నారా?
News February 8, 2025
భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ తాత్కాలికంగా రద్దు

సికింద్రాబాద్-కాగజ్‌నగర్ మధ్య రోజువారీగా రాకపోకలు సాగించే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (రైలు నం.17233, 17234)ను ఈ నెల 10 నుంచి 20 వరకు 11 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో హనుమకొండ, జనగామ జిల్లా ప్రజలు ఇబ్బందులు పడనున్నారు. ఇటీవల ఏ చిన్న సమస్య వచ్చినా రోజుల తరబడి రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేయడం పట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.