News February 26, 2025
పిట్లం: రాజీ కాలేదని కన్నతల్లిని కొట్టి చంపేశాడు..!

కన్న తల్లిని కొడుకు చంపిన ఘటన పిట్లంలో మంగళవారం జరిగింది. SI రాజు వివరాలిలా.. సాబేర బేగం(60)కు నలుగురు కొడుకులు, కూతురు ఉన్నారు. రెండో కొడుకైన శాదుల్ నాలుగేళ్ల క్రితం తన తమ్ముడైన ముజిబ్‌ను కత్తితో పొడిచి చంపాడు. ఈ కేసులో రాజీపడాలని తల్లిని కోరగా ఆమె నిరాకరించింది. దీంతో రోకలి బండతో తలపై దాడి చేయగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్‌ఐ వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 26, 2025
NZB: చికిత్స పొందుతూ మహిళ మృతి

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు వన్ టౌన్ SHO రఘుపతి తెలిపారు. ఈ నెల 23న ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఓ మహిళ అపస్మారక స్థితిలో పడి ఉండటంతో 108 ద్వారా చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. బుధవారం మహిళ మృతి చెందింది. మృతురాలిని ఎవరైనా గుర్తుపడితే వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని రఘుపతి సూచించారు.
News February 26, 2025
పోలింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు: ఎస్పీ

జిల్లాలోని గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎస్పీ రూపేష్ బుధవారం తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో ఉండాలని పేర్కొన్నారు. కేంద్రాల సమీపంలో ప్రచారం చేయవద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News February 26, 2025
ఏలూరు జిల్లాలో TODAY TOP HEADLINES

✷ భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు
✷ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి కలెక్టర్ వెట్రిసెల్వి
✷ శివరాత్రి ఉత్సవాలను పరిశీలించిన ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్
✷ నలుగురు కుటుంబాల్లో విషాదం నింపిన శివరాత్రి
✷ శివాలయాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పూజలు
✷ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మూతబడిన మద్యం దుకాణాలు
✷ ఏలూరు నుంచి ద్వారకాతిరుమలకు పాదయాత్ర చేసిన భక్తులు