News December 4, 2024
పిట్లం: హైవే (161) కన్నీరు పెడుతోంది..! పట్టించుకోరా?
ప్రతిఒక్కరూ తమ ఊరికి మంచి రహదారి ఉండాలనుకోవడం సహజం. కానీ జుక్కల్ నియోజకవర్గ వాసులు హడలిపోతున్నారు. ఆ దారి వెంట ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోక తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో హైవే అధికారుల నిర్లక్ష్యం, కొంత మేర వాహనదారుల నిర్లక్ష్యంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల పిట్లం వద్ద హైవే పై కారుకు గేదెలు అడ్డు రావడంతో కారు బోల్తా కొట్టి ఒకరు మృతి చెందారు.
Similar News
News January 15, 2025
జాతీయస్థాయి పోటీల్లో ఇందూరు బిడ్డకు స్వర్ణం
జాతీయస్థాయి హ్యాండ్ బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన అంజలి ఉత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించిందని పీడీ అజ్మత్ ఖాన్ తెలిపారు. మహబూబ్ నగర్ లో ముగిసిన ఈ టోర్నీలో తెలంగాణ రాష్ట్ర జట్టు ప్రతిభను చాటారు. జిల్లా చరిత్రలో బంగారు పతకం సాధించడం గొప్ప విషయం అని డైరెక్టర్ సంతోష్ కుమార్, శ్రీదేవి పలువురు అంజలిని అభినందించారు.
News January 14, 2025
NZB: పసుపు రైతుల తరఫున PMకు ధన్యవాదాలు: MP
పసుపు రైతుల పక్షాన ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. వర్చువల్‌గా మంగళవారం పసుపుబోర్డు ప్రారంభం సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. తెలంగాణలో పసుపు బోర్డు కోసం నాలుగు దశబ్దాలుగా రైతులు పోరాటం చేస్తున్నారన్నారు. ప్రధాని నిజామాబాద్ రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి పసుపు బోర్డు ఏర్పాటు చేయడం పసుపు పండించే రైతులకు మేలు కలుగుతుందన్నారు.
News January 14, 2025
నవీపేట్: సంక్రాంతి వేడుకల్లో అపశృతి
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో పండగ పూట విషాదం చోటుచేసుకుంది. చైనా మంజాతో ఓ యువకుడి గొంతుతో పాటు రెండు వేళ్లు తెగాయి. దీంతో వెంటనే అతణ్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చైనా మాంజా వాడొద్దని అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నా దుకాణదారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా చైనా మాంజాను వాడకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.