News March 11, 2025

పిట్లం: ‘Way2 News’ కథనానికి స్పందన..!

image

పిట్లం వాసి మిర్యాల చిరంజీవి కొడుకు అరవింద్(12) చిన్న వయస్సులోనే రెండు కిడ్నీలు చెడిపోవడంతో ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మందుల కోసం ఇప్పటికీ రూ.2.50 లక్షలు ఖర్చయింది. <<15721677>>’బాలుడికి కిడ్నీ సమస్య.. సాయం కోసం ఎదురుచూపులు’<<>> అనే శీర్షికతో Way2Newsలో ఇవాళ కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి బాలుడి వివరాలు సేకరించి CMRF పథకం ద్వారా సాయం అందేలా చూస్తామన్నారు.

Similar News

News December 7, 2025

కొత్తగూడెం: వామ్మో.. రూ.12.35 లక్షల కరెంటు బిల్లు హా

image

ప్రతినెల వేలల్లో వచ్చే కరెంటు బిల్లు ఒక్కసారిగా రూ.12,35,191 రావడంతో కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్‌కు చెందిన షాపు నిర్వాహకుడు అశోక్‌ ఆందోళనకు గురయ్యారు. గత నెలలో రూ.40,063 ఉన్న బిల్లు ఈ నెలలో లక్షల్లో చేరడాన్ని చూసి అవాక్కయ్యారు. అధికారుల తప్పిదం వల్లే ఇలా జరిగిందని, సరిచేయాలని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News December 7, 2025

శ్రీసత్యసాయి: తల్లిదండ్రుల మృతి.. అనాథలైన ఇద్దరమ్మాయిలు

image

పరిగిలో అమ్మానాన్నలు మృతి చెందడంతో వారి ఇద్దరి అమ్మాయిలు అనాథలయ్యారు. ఎనిమిదేళ్ల క్రితం తల్లి మరణించగా.. శనివారం తెల్లవారుజామున తండ్రి భజంత్రీ గోపాల్ గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో వారి కుమార్తెలు ఇద్దరూ అనాథలయ్యారు. మండల పాత్రికేయులు తమ వంతుగా ఆ బాలికలకు ఆర్థిక సాయం అందజేసి, భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా తోడుంటామని భరోసా కల్పించారు.

News December 7, 2025

ప్రకాశంలో స్క్రబ్ టైఫస్‌తో మహిళ మృతి.. కానీ!

image

ప్రకాశం జిల్లాలో ‘స్క్రబ్ టైఫస్’ వ్యాధి పాజిటివ్ వచ్చిన మహిళ మృతి చెందినట్లు ప్రకాశం DMHO వెంకటేశ్వర్లు తెలిపారు. యర్రగొండపాలెం మండలానికి చెందిన వృద్ధురాలు గతనెల 11న అనారోగ్యానికి గురైంది. అయితే మెరుగైన చికిత్స కోసం గుంటూరు GGHకు తరలించారు. 29న అక్కడ నిర్వహించిన <<18481778>>టెస్టుల్లో స్క్రబ్ టైఫస్ పాజిటివ్<<>> వచ్చిందన్నారు. ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కూడా మృతికి కారణంగా డీఎంహెచ్వో తెలిపారు.