News March 28, 2025

పిఠాపురంపై పూర్తి ఫోకస్ పెట్టిన డిప్యూటీ సీఎం

image

DYCM పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. ఇటీవల పిఠాపురం రూరల్ ఎస్సై ఏసీబీకి దొరికిపోయారు. గురువారం సోషల్ మీడియాలో పవన్ ఓ పోస్ట్ పెట్టారు. ప్రతివారం పిఠాపురంపై సమీక్షిస్తానని, వేసవిలో నీటి సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని అధికారులను అదేశించారు. పిఠాపురం పరిధిలోని పోలీస్ స్టేషన్‌ల పరిస్థితిపై ఇంటిలిజెన్స్ నివేదిక తీసుకోవాలని సూచించినట్లు అధికారులు పేర్కొన్నారు.

Similar News

News July 11, 2025

కాకినాడతో నాకు ఎంతో అనుబంధం: నటుడు సుమన్

image

కాకినాడ రూరల్ వలస పాకలలో సాయిబాబా గుడి వద్ద గ్రామ పెద్దల ఆధ్వర్యంలో గురువారం గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీనియర్ సినీ హీరో నటుడు సుమన్ పాల్గొన్నారు. జనసేన యువ నాయకుడు పంతం సందీప్ హీరో సుమన్ ఘనంగా సత్కరించారు. వేద పండితులు ఆయనను ఆశీర్వదించారు. సుమన్ మాట్లాడుతూ.. కాకినాడ తో తనకు ఎంతో అనుబంధం ఉందని తెలిపారు.

News July 11, 2025

HYD: కల్తీ కల్లు తాగి ఎనిమిది మంది మృతి

image

కల్తీ కల్లు <<17017648>>రాజేసిన అగ్గి<<>> ఇంకా చల్లారడంలేదు. ఈ ప్రమాదపు కల్లు తాగి అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ పెద్ద గంగారాం (70) అర్ధరాత్రి 1:30కు గాంధీ హాస్పిటల్‌లో మృతి చెందాడు. కూకట్‌పల్లి PS పరిధిలోని ఆదర్శనగర్‌లో ఆయన నివాసం ఉండేవారు. ఈయన మరణంతో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. 30 మందికి పైగా వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొంతుతున్నారు.

News July 11, 2025

KNR: 24 గంటల్లో దొంగలను అరెస్టు చేసిన పోలీసులు

image

కరీంనగర్ మారుతి నగర్‌లో నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి బంగారు పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు నిందితులు నాగరాజు, సదాశివను అరెస్టు చేసినట్లు మూడవ పట్టణ సీఐ జాన్ రెడ్డి తెలిపారు. నిందితులు బంగారు గొలుసు అమ్మేందుకు వెళ్తుండగా చాకచక్యంగా అరెస్టు చేసి, నిందితుల వద్ద బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.