News February 18, 2025
పిఠాపురంలో జనసేన ఆవిర్భావ వేడుకలకు గ్రీన్ సిగ్నల్

జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలను మార్చి 14వ తేదీన పిఠాపురంలో నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. దీనికి ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపినట్లు ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు పిఠాపురంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. కాగా ఎన్నికల్లో ఘన విజయం అనంతరం జనసేన నిర్వహిస్తున్న తొలి సభ కానుండటంతో కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు పార్టీ కసరత్తు చేస్తోంది.
Similar News
News November 21, 2025
NGKL: ఐకాన్ బ్రిడ్జి నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలించిన ఎంపీ ఈటల

కొల్లాపూర్ సోమశిల వద్ద కృష్ణా నదిపై ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐకాన్ తీగల వంతెన నిర్మాణ స్థలాన్ని ఎంపీ ఈటల రాజేందర్ పరిశీలించారు. రెండు రాష్ట్రాలను కలిపే ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం రూ.1083 కోట్లతో చేపట్టింది. ఈ వంతెన పర్యాటక అభివృద్ధికి దోహదపడనుంది. ఈటల, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, BJP ఇన్చార్జితో కలిసి లాంచీలో నిర్మాణ స్థలాన్ని సందర్శించి, నీటి నిల్వ సామర్థ్యాన్ని అడిగి తెలుసుకున్నారు.
News November 21, 2025
బ్రాహ్మణపల్లిలో నూతన విత్తన బిల్లు-2025పై చర్చా గోష్ఠి

PDPL జిల్లా బ్రాహ్మణపల్లి రైతు వేదికలో TG రైతు విజ్ఞాన కేంద్రం, KNR ఆధ్వర్యంలో నూతన విత్తన బిల్లు 2025 ముసాయిదాపై చర్చా గోష్ఠి జరిగింది. జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రైతులకు నాణ్యమైన విత్తనాల సరఫరాకు బిల్లు ఎంత కీలకమో వివరించారు. డా. రాజేంద్ర ప్రసాద్ బిల్లుపై పవర్ పాయింట్ ప్రెజంటేషన్ అందించారు. శాస్త్రవేత్తలు, విత్తన ధ్రువీకరణ సంస్థ ప్రతినిధులు, సీడ్స్మెన్ సభ్యులు, రైతు సంఘాలు పాల్గొన్నారు.
News November 21, 2025
గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు పటిష్ట చర్యలు: కలెక్టర్

యువత భవిష్యత్తును అంధకారం చేసే గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో శుక్రవారం మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి పాఠశాల, కళాశాలలో పోస్టర్లు, సమావేశాల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.


