News September 6, 2024
పిఠాపురంలో జిల్లా కోర్టు నూతన భవనం ప్రారంభం

పిఠాపురంలో జిల్లా కోర్టు నూతన భవనాన్ని ప్రారంభించారు. వర్చువల్ విధానంలో హైకోర్టు నుంచి ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ శిలాఫలకం ఆవిష్కరించారు. కోర్టు సమూహాన్ని జిల్లా జడ్జి గంధం సునీత ప్రారంభించారు. సర్వమత గురువులతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి కోర్టు హాల్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
Similar News
News November 14, 2025
రాజమండ్రిలో రేషన్ డీలర్‌పై కేసు నమోదు

రాజమండ్రిలోని నెం.39 రేషన్ షాపును ఆర్డీవో కృష్ణనాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ అందుబాటు, పంపిణీ రిజిస్టర్లు, ఆన్లైన్ రికార్డులను సమగ్రంగా పరిశీలించారు. స్టాక్‌కు ఆన్లైన్ రికార్డులకు మధ్య 360 కిలోల బియ్యం అదనంగా ఉన్నట్లు గుర్తించారు. సంబంధిత రేషన్ షాపు డీలర్‌పై నిత్యావసర సరుకుల యాక్ట్ సెక్షన్ 6A కింద కేసు నమోదు చేశారు.
News November 14, 2025
రాజమండ్రి నుంచి శబరిమలకు ప్రత్యేక బస్సులు

అయ్యప్ప భక్తులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. రాజమండ్రి నుంచి శబమరిమలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. సూపర్ లగ్జరీ బస్సును డీపీటీవో వై.సత్యనారాయణమూర్తి శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. తిరుపతి, కాణిపాకం, అరుణాచలం మీదుగా శబరిమలకు బస్సులు వెళ్తాయన్నారు. 5రోజులు సాగే ఈ యాత్రకు ఈనెల 15, 17వ తేదీల్లో రాజమండ్రి నుంచి వెళ్తాయని చెప్పారు. డీఎం మాధవ్, పీఆర్వో శివకుమార్ పాల్గొన్నారు.
News November 14, 2025
తూ.గో జిల్లా రాజకీయాలపై చర్చ

తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ పటిష్ఠతకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆ పార్టీ PAC సభ్యుడు ముద్రగడ పద్మనాభం సూచించారు. వైసీపీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, మాజీ ప్రచార కమిటీ అధ్యక్షుడు తోట రామకృష్ణ తదితరులు పద్మనాభాన్ని కిర్లంపూడిలోని ఆయన నివాసంలో కలిశారు. జిల్లా రాజకీయాల గురించి సుదీర్ఘంగా చర్చించారు.


