News March 13, 2025
పిఠాపురంలో పవన్ ఫొటో వైరల్

పిఠాపురం(చిత్రాడ)లో రేపే జనసేన ఆవిర్భావ సభ జరగనుంది. దీనికి జయకేతనం అని పేరు పెట్టారు. పిఠాపురంలో ఎటు చూసినా జనసేన ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. పవన్ను ఆకట్టుకోవడానికి కొందరు వినూత్నంగా పోస్టర్లు ఏర్పాటు చేశారు. ‘రాయల వారి రాజ్యం.. పవన్ అన్నకే సాధ్యం’ అంటూ పవన్ ఫొటోను ఓ వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలుగా మార్చారు. ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Similar News
News November 18, 2025
రెండు రోజులు జాగ్రత్త!

TG: రాబోయే రెండు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 4 నుంచి 5 డిగ్రీల మేర తక్కువగా నమోదవుతాయని చెప్పింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చలిగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది. ఉదయం 9 గంటలైనా తీవ్రత తగ్గడం లేదు.

మూవీ ముచ్చట్లు

*కల్ట్ క్లాసిక్ సినిమా ‘షోలే’ డిసెంబర్ 12న థియేటర్లలో రీరిలీజ్ కానుంది.
*మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థతో చేతులు కలిపిన దర్శకుడు ప్రశాంత్ నీల్. పూజా కార్యక్రమంతో హారర్ చిత్రం ప్రారంభం. సమర్పకుడిగా వ్యవహరించనున్న నీల్.
* ‘వారణాసి’ వీడియోకు అద్భుత స్పందన రావడంతో సాంకేతిక బృందానికి థాంక్స్ చెప్పిన రాజమౌళి. ప్రతి ఒక్కరి పేరు ప్రస్తావిస్తూ ట్వీట్.