News March 30, 2024

పిఠాపురంలో పవన్ షెడ్యూల్ ఇలా.. నేటి నుంచి షురూ

image

జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ పిఠాపురం నియోజకవర్గంలో 4 రోజుల పాటు పర్యటించనున్నారు. తొలిరోజు శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు గొల్లప్రోలులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌లో పవన్‌ దిగనున్నారు. అక్కడి నుంచి పిఠాపురం పాదగయ క్షేత్రం, అనంతరం దత్తపీఠాన్ని సందర్శిస్తారు. అనంతరం దొంతమూరులో TDP మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ నివాసానికి వెళ్లి ఆయనను పలకరిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు చేబ్రోలు బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

Similar News

News September 18, 2025

యూరియా తగినంత ఉంది కలెక్టర్ కీర్తి

image

జిల్లాలో యూరియా కొరతపై వ్యాపించిన వదంతులను నివృత్తి చేయడానికి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామాన్ని సందర్శించారు. దొమ్మేరు ప్యాక్స్ వద్ద రైతులు, అధికారులతో ఆమె మాట్లాడారు. జిల్లాలో యూరియా తగినంత నిల్వ ఉందని, రైతులు ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు.

News September 18, 2025

పెద్దవం, ఐ.పంగిడీ గ్రామాల్లో కలెక్టర్ కీర్తి చేకూరి పర్యటన

image

ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణలో పశువుల చికిత్సలకు ప్రత్యేక వైద్యుల బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపడం జరిగిందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. గురువారం తాళ్లపూడి మండలం పెద్దేవం, ఐ.పంగిడీ గ్రామాల్లో కలెక్టర్ పర్యటించి రైతులతో ముఖాముఖి మాట్లాడారు. గేదెల వ్యాధి నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

News September 18, 2025

కలెక్టర్‌ను కలిసిన రాజమహేంద్రవరం జైల్ సూపరింటెండెంట్

image

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ బాధ్యతలు చేపట్టిన కీర్తి చేకూరిను గురువారం ఉదయం కలెక్టర్ కార్యాలయ ఛాంబర్‌లో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ రాహుల్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జైళ్లలో పరిస్థితిని ఆమెకు వివరించారు. అందరి సహకారంతో జిల్లాను అభివృద్ది పథంలో నడపాలని కలెక్టర్ అన్నారు.