News January 11, 2025
పిఠాపురంలో ప్రతి ఊరికి వస్తా: పవన్
పిఠాపురం పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఇకపై పిఠాపురం నుంచే నా జర్నీ స్టార్ట్ చేస్తా. ఈ నియోజకవర్గంలోని ప్రతి ఊరిలో పర్యటిస్తా. కష్టపడి పనిచేస్తా. ఈ ఐదేళ్లలోనే నేను చేసిన పనులు నచ్చితేనే మరోసారి నాకు MLAగా అవకాశం ఇవ్వండి. లేకపోతే మీ ఇష్టం. పిఠాపురం శక్తిపీఠం మీద ఒట్టేసి చెబుతున్నా.. మా కూటమి ప్రభుత్వం 15 ఏళ్లు ఉండాలని కోరుకున్నా’ అని పవన్ అన్నారు.
Similar News
News January 20, 2025
సీఎం, డిప్యూటీ సీఎంకు హరిరామ జోగయ్య లేఖ
మాజీ మంత్రి, కాపు సంక్షేమ శాఖ అధ్యక్షుడు హరిరామ జోగయ్య సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కి లేఖ రాశారు. కాపులకు 5% రిజర్వేషన్ అమలు చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. వైసీపీ కాపుల పట్ల కక్షపూరితంగా వ్యవహరించి రిజర్వేషన్ అమలు చేయలేదని మండిపడ్డారు. గతంలో తాను నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ రిజర్వేషన్ అంశంలో కలిసి పనిచేద్దామని చెప్పారన్నారు. పవన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని లేఖలో పేర్కొన్నారు.
News January 20, 2025
యువకుడితో మృతితో పేరవరంలో విషాద ఛాయలు
ప్రత్తిపాడు(M) ధర్మవరం వద్ద ఆదివారం జరిగిన ప్రమాదంలో శివ(22) అనే యువకుడు <<15196950>>మృతి చెందిన<<>> సంగతి తెలిసిందే. బైక్‌పై నిదానంగానే వెళ్తున్నా మృత్యువు లారీ రూపంలో వచ్చి బలితీసుకుంది. బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్తుండగా ఒక్కసారిగా ఈ దుర్ఘటన జరిగింది. వెళ్లొస్తా అంటూ హుషారుగా ఇంట్లో చెప్పి వెళ్లిన కుర్రాడు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. స్వగ్రామం పేరవరంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
News January 20, 2025
నిడదవోలు విద్యార్థి విజయనగరంలో ఆత్మహత్య
తూ.గో జిల్లా నిడదవోలుకు చెందిన MBBS వైద్య విద్యార్థి ఆతుకూరి సాయి మణిదీప్ ఆదివారం నెల్లిమర్ల మిమ్స్ వైద్య కళాశాలలో తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. చదువుపై ఏకాగ్రత లేకపోవడం, కుటుంబ సభ్యుల వేదనకు తానే కారణమవుతున్నానంటూ తల్లిదండ్రులకు సూసైడ్ నోట్ రాసి పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.