News January 5, 2025

పిఠాపురంలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

పిఠాపురం పట్టణంలోని స్థానిక పాత బస్టాండ్ వద్ద పెట్రోల్ బంకు సమీపంలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. తుని నుంచి కాకినాడ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అటుగా వెళుతున్న సైకిలిస్టు అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పిఠాపురం పట్టణ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 11, 2025

తూ.గో: హోం స్టే పెడితే రూ.5లక్షలు

image

తూ.గో జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో కనీసం ఓ గది నుంచి గరిష్ఠంగా 6గదులతో హోం స్టే ఏర్పాటు చేసుకోవచ్చని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ‘కొత్తగా పెట్టేవారికి స్వదేశ దర్శన్ పథకం కింద రూ.5 లక్షల ప్రోత్సాహకం ఇస్తాం. పాత హోమ్ స్టే పునరుద్ధరణకు రూ.3లక్షల వరకు సాయం చేస్తాం. 7ఏళ్లు 100 శాతం SGST తిరిగి చెల్లిస్తాం. మొదటి మూడేళ్లు రిజిస్ట్రేషన్ ఉచితం. యజమాని అదే ఏరియాలో ఉండాలి’ అని కలెక్టర్ చెప్పారు.

News November 11, 2025

రన్నర్‌గా తూ.గో జిల్లా అధికారులు

image

అనంతపురంలో ఈనెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు 7వ రాష్ట్రస్థాయి రెవెన్యూ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్-2025 జరిగింది. ఇందులో తూ.గో జిల్లా రెవెన్యూ అధికారులు, సిబ్బంది ప్రతిభ చూపారు. బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో కడియం తహసీల్దార్ ఎం.సునీల్ కుమార్, రాజానగరం సీఎస్ డీటీ జి.బాపిరాజు జట్టు రన్నర్‌‌గా నిలిచారు. వాలీబాల్ విభాగంలో తూ.గో జట్టు రన్నర్‌‌గా నిలిచింది.

News November 11, 2025

తూ.గో జిల్లాలో 8,773 ఇళ్ల నిర్మాణం పూర్తి

image

తూ.గో జిల్లాలో 8,773 మంది లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నారని హౌసింగ్ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్(PD) నాతి బుజ్జి వెల్లడించారు. ఈ మేరకు బుధవారం గృహప్రవేశాలు చేస్తారని చెప్పారు. అన్ని నియోజక వర్గాల పరిధిలో స్థానిక ప్రజాప్రతినిధులు సమక్షంలో గృహప్రవేశాలు వేడుకగా నిర్వహిస్తామన్నారు. గోకవరం మండలం కామరాజుపేటలో జరిగే కార్యక్రమానికి కలెక్టర్ హాజరవుతారన్నారు.