News January 5, 2025

పిఠాపురంలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

పిఠాపురం పట్టణంలోని స్థానిక పాత బస్టాండ్ వద్ద పెట్రోల్ బంకు సమీపంలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. తుని నుంచి కాకినాడ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అటుగా వెళుతున్న సైకిలిస్టు అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పిఠాపురం పట్టణ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 21, 2025

అమలాపురం: పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట

image

ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రేమ జంట అమలాపురం రూరల్ పోలీసులను మంగళవారం ఆశ్రయించింది. అమలాపురం రూరల్ మండలం సమనస గ్రామానికి చెందిన మధుర వెంకటేష్, కాకినాడ పట్టణానికి చెందిన సబ్బతి ప్రమీలా దేవి ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న అనంతరం ఇరు కుటుంబాల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ అమలాపురం రూరల్ పోలీసులను కోరారు.

News January 21, 2025

కిర్లంపూడి: రహదారి ప్రమాదంలో స్నేహితుల మృతి

image

కాకినాడ జిల్లాకు చెందిన దాసరి నిమ్స్ చంద్ర(23), ముక్త దుర్గ బాబు(24)లు బైక్‌పై వెళ్తుండగా విజయవాడ హైవేపై నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. నిమ్స్‌చంద్ర తండ్రి ఆటో డ్రైవర్, తల్లి అంగన్ వాడీ కార్యకర్త. కిర్లంపూడికి చెందిన ముక్తదుర్గసాయి తమ్ముడు 10 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఇప్పుడు కుమారుడి మరణంతో తల్లిదండ్రులు ముత్తా పెద్దకాపు, సరస్వతి విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.

News January 21, 2025

గోకవరం: నేరస్థుడికి ఐదేళ్లు జైలు-ఎస్సై

image

గోకవరం గ్రామానికి చెందిన పిల్లి ఆనందబాబుకు ఐదేళ్ల జైలు రూ.22 వేలు జరిమానాను అడిషనల్ జిల్లా సెషన్స్ జడ్జి శ్రీ లలిత విధిస్తూ తీర్పునిచ్చారు. 2015 సంవత్సరంలో గోకవరానికి చెందిన స్వాతి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నానని శారీరకంగా ఇబ్బంది పెట్టడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. పిల్లి ఆనందబాబుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి రాజమండ్రి కోర్టులో నేరం రుజువు చేయడంతో శిక్ష పడినట్లు గోకవరం ఎస్సై సోమవారం తెలిపారు.