News March 3, 2025

పిఠాపురంలో సందడి చేసిన మీనాక్షి చౌదరి

image

పిఠాపురంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీరాజరాజేశ్వరీ సమేత ఉమా కుక్కటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రముఖ హీరోయిన్ లక్కీ భాస్కర్ ఫేమ్ మీనాక్షి చౌదరి సందడి చేశారు. సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని మహాశివుడు దర్శనం కోసం వచ్చినట్లు ఆమె తెలిపారు. మీనాక్షి చౌదరితో ప్రజలు సెల్ఫీలు దిగారు. ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందంటూ మీనాక్షి తెలిపారు.

Similar News

News January 4, 2026

గడువులోగా ఫొటో సిమిలర్‌ ఎంట్రీల పూర్తి

image

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR)లో భాగంగా ఫొటో సిమిలర్‌ ఎంట్రీ ప్రక్రియను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేస్తామని జిల్లా ఎన్నికల అధికారి డా.సత్య శారద తెలిపారు. శనివారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ చాహత్ వాజ్పేయి, అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి ఓటరు జాబితా స్వచ్ఛీకరణ, క్షేత్రస్థాయి పరిశీలన తీరును వివరించారు.

News January 4, 2026

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓ఏసీబీకి చిక్కిన కొత్తగూడెం అటవీ అధికారులు
✓భద్రాచలం గోదావరికి కనుల పండుగగా నదీహారతి
✓జూలూరుపాడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పై సస్పెన్షన్ వేటు
✓ఓటర్ల జాబితా సవరణ గడువులోగా పూర్తి చేయాలి: కలెక్టర్
✓పినపాక: అక్రమ ఇసుక నిలువలు సీజ్
✓బూర్గంపాడు: 9మంది కోడిపందాల రాయుళ్లు అరెస్ట్
✓దమ్మపేట: మందలపల్లి వద్ద పోలీసుల స్పెషల్ డ్రైవ్
✓దమ్మపేట: మైనర్ బాలిక పై వేధింపులు పోక్సో కేసు నమోదు

News January 4, 2026

ఇలా చేస్తే ఐదు నిమిషాల్లోనే నిద్ర పోతారు

image

పని ఒత్తిడి, మానసిక ఆందోళనలతో చాలామంది నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారు. అయితే రాత్రి పడుకునే ముందు నిశ్శబ్దంగా కూర్చొని శ్వాసపై దృష్టి పెట్టి ధ్యానం చేయడం వలన మెదడు ప్రశాంతమవుతుంది. ఒత్తిడిని పెంచే కార్టిసాల్ హార్మోన్ నియంత్రణలోకి వస్తుంది. నిద్రలో మేల్కొనే సమస్య ఉన్నవారికి సైతం ఈ టెక్నిక్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రోజూ పడుకునే ముందు 5 నిమిషాల పాటు ధ్యానం చేస్తే మంచిదని నిపుణులు అంటున్నారు.