News February 13, 2026
పిఠాపురం: అనాథలైన చిన్నారులతో మాట్లాడిన కలెక్టర్

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉదారతతో ఇద్దరు చిన్నారులకు ఆసరా దొరికింది. డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ వద్దకు చేరిన ఇద్దరు చిన్నారులకు అండగా నిలబడేందుకు జిల్లా అధికార యంత్రాంగం మానవత్వంతో ముందడుగు వేసింది. పిల్లలకు గూడు కల్పించేందుకు ఇంటి స్థలాన్ని ఇచ్చేందుకు నడుం బిగించిందని కలెక్టర్ తెలిపారు. మాదాపురానికి చెందిన ఇద్దరు చిన్నారులతో ఇవాళ కలెక్టరేట్లో కలెక్టర్ మాట్లాడారు.
Similar News
News March 9, 2026
‘కల్కి’ కోసం కమల్ హాసన్‌కు రోజుకు ₹15 కోట్లు?

‘కల్కి 2898 AD’ సినిమాలో సుప్రీమ్ యాష్కిన్ పాత్ర పోషించిన కమల్ హాసన్ రెమ్యునరేషన్‌పై SMలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయన కేవలం 10 రోజుల షూటింగ్ కోసం ఏకంగా ₹150 కోట్లు తీసుకున్నారని నటుడు యుగి సేతు అన్నారు. అంటే రోజుకు దాదాపు ₹15 కోట్లు అన్నమాట. అయితే చిత్ర బృందం మాత్రం దీన్ని కొట్టిపారేసినట్లు సమాచారం. ఇది రూమర్ మాత్రమేనని.. కమల్ పారితోషికం ఇంత భారీ స్థాయిలో ఉండదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
News March 9, 2026
విమానాశ్రయం ద్వారా నేడు ఎంతమంది ప్రయాణించారంటే..!

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా సోమవారం 40 విమాన సర్వీసులు ప్రయాణించాయని గన్నవరంలోని ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. వీటిలో 20 సర్వీసుల ద్వారా 1,836 మంది ఈ విమానాశ్రయంలో దిగారని, ఇక్కడ నుంచి 2,111 మంది 20 సర్వీసులలో ప్రయాణించారని తెలిపింది. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆయా సర్వీసుల సేవలను నిర్వహిస్తున్నామంది.
News March 9, 2026
HYD స్టేడియాలకు మహర్దశ.. లిస్టులో ఇవే!

నగరంలోని వివిధ ప్రాంతాల స్టేడియాలకు మహర్దశ పట్టనుంది. సరూర్‌నగర్ స్టేడియం, ఎల్బీ స్టేడియం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, లాల్ బహుదూర్ శాస్త్రి స్టేడియాలను ఆధునికరించాలని తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఆయా సంబంధిత శాఖకు నేడు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ప్రణాళికలు రచించి వేసవిలో పనులు ప్రారంభించి పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.


