News March 13, 2025
పిఠాపురం: ఆవిర్భావ సభకు వచ్చే జనసైనికులకు పార్టీ హితవు

జనసేన ఆవిర్భావ సభకు లక్షల్లో క్యాడర్ రానున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే వారికి పార్టీ కొన్ని సూచనలు చేసింది. ‘టోల్ ప్లాజా వద్ద గొడవలు పెట్టుకోవద్దు. ట్రాఫిక్ అంతరాయం కలిగించొద్దు. క్రమశిక్షణతో ఉండాలి. మద్యం సేవించి వాహనాలు నడపొద్దు. సభాస్థలిలో ప్రశాంతంగా ఉండాలి. ప్రచార పత్రంలో పార్టీ అధ్యక్షుని ఫోటో, పార్టీ ఆమోదించిన వారి ఫోటోలే ఉండాలి’ అంటూ కార్యకర్తలకు మార్గదర్శకాలు జారీ చేశారు.
Similar News
News November 22, 2025
‘పండ్లు, కూరగాయల సాగుతో ఎక్కువ లాభం’

నారింజ పంట ఉత్పత్తికి నాణ్యమైన విత్తనాల కోసం నాగ్‌పూర్‌లో రూ.70 కోట్లతో క్లీన్‌ప్లాంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. భూసార పరీక్షలు, నాణ్యమైన విత్తనాలను అందజేయడంపై ICAR సైంటిస్టులు దృష్టిపెట్టాలన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలంటే పండ్లు, కూరగాయ పంటలను సాగు చేయాలని.. యంత్రాలు, డ్రిప్ ఇరిగేషన్ వాడకంపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు.
News November 22, 2025
మధ్యాహ్నంలోగా రిపోర్ట్ అందజేయండి: అదనపు కలెక్టర్

గ్రామాల్లోని పోలింగ్ స్టేషన్లలో కనీస వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మధుసూదన్ నాయక్ ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీ అధికారిణి నిఖిలతో కలిసి శనివారం ఎంపీడీఓలు, ఎంపీవోలు గ్రామ పంచాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని గ్రామాల్లోని పోలింగ్ స్టేషన్స్‌లో విద్యుత్, తాగునీరు, వికలాంగులు, వృద్ధులకు ర్యాంప్ సౌకర్యం వసతులు పరిశీలన చేసి.. మధ్యాహ్నంలోగా రిపోర్ట్ అందజేయాలన్నారు.
News November 22, 2025
HYD: నేడు సీఐడీ విచారణకు మంచులక్ష్మి

నేడు సీఐడీ విచారణకు మంచులక్ష్మి హాజరుకానుంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో మంచు లక్ష్మిని సీఐడీ అధికారులు విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే ఈడీ విచారణను మంచులక్ష్మి ఎదుర్కొనగా.. మధ్యాహ్నం సీఐడీ సిట్ ఎదుట మంచు లక్ష్మి హాజరుకానున్నారు. కాగా, ఇప్పటికే రానా, విష్ణు ప్రియలను విచారించిన విషయం తెలిసిందే.


