News May 20, 2024

పిఠాపురం, కాకినాడ నియోజకవర్గాలపై ఫోకస్

image

రాష్ట్రంలో పోలింగ్ అనంతరం పలుచోట్ల జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియపై EC దృష్టి సారించింది. హింసకు తావున్న ప్రాంతాలు, వ్యక్తులను గుర్తించి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం కాకినాడ నగరం, పిఠాపురం నియోజకవర్గాల్లో కౌంటింగ్ నేపథ్యంలో హింసాత్మక ఘటనలు జరిగే ఆస్కారం ఉందని హెచ్చరించింది. దీంతో కౌంటింగ్‌కు ముందే ఇక్కడ కేంద్ర బలగాలతో పహారా కాయనున్నారు.

Similar News

News December 11, 2025

కందుల దుర్గేశ్‌కు 7వ ర్యాంకు

image

పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ పాలనలో జెట్ స్పీడ్ చూపిస్తున్నారు. ఫైళ్ల పరిష్కారంలో రాష్ట్రంలోనే 7వ ర్యాంకు సాధించి సీఎం ప్రశంసలు పొందారు. జనసేన కోటాలో మంత్రి అయిన దుర్గేశ్.. 316 ఫైళ్లను కేవలం 3 రోజుల 9 గంటల 21 నిమిషాల సమయంలోనే క్లియర్ చేసి సత్తా చాటారు. కాగా ఫైళ్ల పరిష్కారంలో జనసేనాని పవన్ కళ్యాణ్ 11వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.

News December 11, 2025

తూ.గో. కలెక్టర్‌కు 13వ ర్యాంకు

image

సీఎం చంద్రబాబు గత మూడు నెలలుగా రాష్ట్రంలోని కలెక్టర్ల పనితీరును బట్టి వారికి ర్యాంకులు కేటాయించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి IAS 711 ఫైళ్లు స్వీకరించి, 680 ఫైళ్లను పరిష్కరించారు. ఆమె సగటు ప్రతిస్పందన సమయం 1 రోజు 21 గంటల 12 నిమిషాలుగా ఉంది. ఈమె పనితీరు ఆధారంగా ఆమెకు 13వ ర్యాంకు కేటాయించారు.

News December 10, 2025

ధాన్యం కొనుగోలులో పారదర్శకత అవసరం: జేసీ

image

ధాన్యం కొనుగోలులో గోనె సంచులు, రవాణా, కొలతలు, చెల్లింపులు వంటి అన్ని అంశాల్లో పారదర్శకత ఉండాలని జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి వీసీ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ఫిర్యాదులు అందిన నేపథ్యంలో క్షేత్ర స్థాయి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని.. ప్రతి సమాచారం రైతులకు, మీడియాకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.